Konda Surekha: అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మరో వివాదంలో చిక్కుకున్నారు. వేములవాడ రాజన్న కోడెల వివాదంలో మంత్రి పేరు వినిపిస్తోంది. కోడెల పంపిణీలో ఆలయ ఈఓ వినోద్ రెడ్డి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కోడెలు దారి తప్పుతున్నారని ఆరోపిస్తూ విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ నాయకుల ఫిర్యాదుతో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. మంత్రి కొండా సురేఖ సిఫార్సుతో రాజన్న ఆలయ కోడెలు పక్కదారి పడుతున్నాయని ఆందోళన చేపట్టారు. మంత్రి సూచన మేరకు ఆగస్టు 12న రాంబాబు అనే వ్యక్తికి ఆలయ అధికారులు 49 కోడళ్లను అందజేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
Reasd also: CM Viral Tweet: ఏడాది ప్రజాపాలనలో ఎంతో సంతృప్తి.. సీఎం ట్వీట్ వైరల్..
మంత్రిని మెప్పించడం కోసమే నిబంధనలకు విరుద్ధంగా కోడళ్లను అప్పగించారనే ప్రచారం సాగుతోంది. కేవలం రెండు, మూడు కోడెలను మాత్రమే రైతులకు అందజేసి మంత్రి సూచన మేరకు రాంబాబు అనే వ్యక్తికి ఒకేసారి 49 కోడెలను ఇవ్వడంతో వివాదాస్పదమైంది. కోడెలను టెండర్ ద్వారా పొందినట్లు రాంబాబు ఇప్పటికే పోలీసులకు వెల్లడించాడు. ఈ నేపథ్యంలో మంత్రి అనుచరుడు రాంబాబుపై వరంగల్ జిల్లా గీసుకొండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
Reasd also: Viral Video: ఇదేక్కడి మాస్ రా మావా? పడుకుని కాళ్లతో స్టీరింగ్‌ని కంట్రోల్ చేస్తున్న లారీ డ్రైవర్(వీడియో)
49 పశువుల వ్యాపారి అయిన మంత్రి అనుచరుడికి కోడెలను అప్పగించడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఒకే వ్యక్తికి కోడెదూడలను కేటాయించడంపై విచారణ జరిపించాలని విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో కోడెల వ్యవహారం మరోసారి తెరపైకి రావడంతో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు వేములవాడ రాజన్న ఆలయ కోడెల తరలింపు పై, రాజన్న ఆలయ ఈఓ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకుల ధర్నా చేపట్టింది. ఈవోను సస్పెండ్ చేసి,విచారణ చేపట్టాలని అన్నారు. మంత్రి అనుచరులకు రాజన్న కోడెలు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. మంత్రివర్గం నుండి కొండ సురేఖను భర్తరఫ్ చేయాలంటూ డిమాండ్ చేశారు.
Pushpa 2 : పుష్ప 2 సినిమా చూడాలన్న ఆతృతలో ట్రైన్ చూసుకోకపోవడంతో తీవ్ర విషాదం