Site icon NTV Telugu

Rajanna Sircilla Crime: సిరిసిల్లలో దారుణం.. దంపతుల అనుమానస్పద మృతి..

Rajanna Ciricilla Crime

Rajanna Ciricilla Crime

Rajanna Sircilla Crime: దంపతుల అనుమానస్పద మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలకలం రేపుతుంది. జిల్లా కేంద్రంలోని శాంతి నగర్ కు చెందిన ముదాం వెంకటేష్ (40), వసంత (36) అనే భార్య భర్తలు నివాసం ఉంటున్నారు. వీరికి కూతురు వర్షిణి, కొడుకు అజిత్ ఉన్నారు. ఏం జరిగిందో తెలియదు గానీ.. వెంకటేష్, వసంత ఇద్దరు ఓ పొలంలో శవమై తేలారు. దీంతో కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటన వద్దకు చేరుకున్న పోలీసులకు కొని ఆధారాలు లభించాయి. ఘటన స్థలంలో పురుగుల మందు డబ్బా కట్టెకు రక్తపు మరకలు గుర్తించారు. భార్య వసంతను భర్త వెంకటేష్ కట్టేతో కొట్టి చంపినట్లు అనుమానిస్తున్నారు. అనంతరం వెంకటేష్ పురుగుల మందు తాగి మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబ కలహాలతోనే భార్యను చంపినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే స్థానిక, మృతుల కుటుంబాలని దర్యాప్తు చేసి అనుమానంపై క్లారిటీ ఇవ్వనున్నారు. అయితే వీరిద్దరూ పొలంలో ఎందుకు వచ్చారు? నిజంగానే భర్త వెంకటేస్ భార్య వసంతను చంపాడా? లేక ఎవరైనా వీరిని చంపి ఇలా చిత్రీకరిస్తున్నారా? అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇప్పుడే క్లారిటీ ఇవ్వలేమని దర్యాప్తు తరువాత దీనిపై సమాచారం ఇస్తామని పోలీసులు తెలిపారు.
CM Revanth Reddy: నేడు ఎల్బీ స్టేడియంలో బాలల దినోత్సవ వేడుకలు.. హాజరు కానున్న సీఎం

Exit mobile version