NTV Telugu Site icon

Rajanna Sircilla: వర్కర్ టు ఓనర్ పథకం వెంటనే ప్రారంభించాలి.. నేతన్నలు రిలే నిరాహార దీక్ష..

Ranjanna Siricilla

Ranjanna Siricilla

Rajanna Sircilla: వర్కర్ టు ఓనర్ పథకం వెంటనే ప్రారంభించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో నేతన్నలు రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు. అంబేద్కర్ చౌరస్తాలో సిరిసిల్ల పట్టణంలో నెలకొన్న పవర్లూమ్ వస్త్ర పరిశ్రమ, విద్యుత్, ఇతర సమస్యలను తీర్చాలని రిలే నిరాహార దీక్ష. రేపటి నుండి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో సిరిసిల్ల నేత కార్మికులపై చర్చించి ఉపాధి అవకాశాలు హామీ కల్పించాలనీ జేఏసీ డిమాండ్ చేసింది.

Read also: CM Chandrababu: రాజకీయ ప్రతీకారాలకు పోవద్దు.. ఎన్డీయే శాసనసభాపక్ష భేటీలో చంద్రబాబు సూచనలు

నేత కార్మికుల ప్రధాన డిమాండ్ ఇవే..

* జనతా వస్త్ర పథకం అమలు చేయాలి..

* సిరిసిల్ల నెలకొన్న పవర్లూమ్ వస్త్ర పరిశ్రమను రక్షించండి.

* 10 శాతం యారన్ సబ్సిడీ, ట్రిప్టు, నేతన్న బీమా పథకాలను యధావిధిగా కొనసాగించాలి.

* యారన్ డిపో ఏర్పాటుచేసి ప్రభుత్వమే యారన్ సప్లై చేయాలి.

* కాంగ్రెస్ పార్టీ నేత కార్మికులకు ఇచ్చిన హామీ వెంటనే నెరవేర్చాలి.

* నేత కార్మికుల సమస్యలు ఎందుకు తీర్చడంలో ఎందుకు విఫలం అవుతున్నారు.

* మా సమస్యలు తీర్చాలని మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చిన ఎందుకు పట్టించుకోవడం లేదు.

Read also: Ponguleti Srinivasa Reddy: అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రాజెక్ట్ కు గండి..

* ముఖ్యమంత్రి జౌళి శాఖపై సమావేశం ఏర్పాటు చేసి ఎందుకు వాయిదా వేస్తున్నారు.

* సిరిసిల్లలో అనేక మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు వారికి ప్రభుత్వం ఎందుకు అండగా ఉండడం లేదు.

* సిరిసిల్ల ఉరిశిల్లగా మారక ముందే సమస్యను పరిష్కరించండి.

* 25 తేదీన చలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టి అసెంబ్లీ నీ ముట్టడిస్తాం.

* నేతన్నల సమస్య పరిష్కారం కొరకు 119 ఎమ్మేల్యేలకు లెటర్ రాస్తాం.

* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నేత కార్మికులకు ఉపాది కల్పించాలి.

* జనతా పథకం వెంటనే ప్రారంభించాలి.

* వర్కర్ టు ఓనర్ పథకం వెంటనే ప్రారంభించాలి.

* గత ప్రభుత్వం కంటే ఒక్క మీటర్ ఎక్కువ ఇస్తం అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పని కల్పించడం లేదని మండిపడ్డారు. మరి దీనిపై ప్రభుత్వం స్పందిస్తుందా? అనే దానిపై ఉత్కంఠ నెలకుంది.
TG Health Department: కురుస్తున్న భారీ వర్షాలు.. ఆరోగ్య శాఖ సూచనలు..