NTV Telugu Site icon

KTR in Sircilla: నేడు సిరిసిల్లలో కేటీఆర్‌ పర్యటన.. విద్యుత్ చార్జీల పెంపుపై బహిరంగ చర్చ..

Ktr

Ktr

KTR in Sircilla: రైతాంగ సమస్యలపై బీఆర్ఎస్ ఉద్యమ బాట చేపట్టింది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు సిరిసిల్లలో పర్యటించనున్నారు. ఉదయం జిల్లా కేంద్రంలో పద్మనాయక కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సెస్ విద్యుత్ చార్జీల పెంపుపై బహిరంగ చర్చ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. చర్చ అనంతరం కేటీఆర్ హైదరాబాద్‌కు బయలుదేరి వస్తారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు పార్క్ హయత్ హోటల్‌లో ఒక కార్యక్రమానికి కేటీఆర్ హాజరవుతారు.

Read also: Drugs Seized: మరోసారి డ్రగ్స్‌ కలకలం.. రూ.25 లక్షల విలువచేసే MDMA స్వాధీనం

కాగా.. ఆదిలాబాద్‌లో బీఆర్ఎస్ రైతు పోరుబాట పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సభలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో పనులు ఆగిపోయినవి..డిచ్‌పల్లి వద్ద ఆడపిల్లలు కూర్చున్నారు.. చిన్న పిల్లలను ఎత్తుకొని కూర్చున్నారు.. పోలీసుల భార్యలు, పిల్లలు ధర్నా చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో పోలీసుల భార్యలు రోడ్డు ఎక్కారు.. జైలుకు పోవడానికి రెడీ.. ఏడాది, రెండేళ్లు అయినా జనం కోసం జైల్లో ఉంటానని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ వాళ్ళను ఉరికించి కొట్టే రోజులు వస్తాయి.. అన్ని వర్గాలను మోసం చేశారని 420 కేసు పెట్టాలంటే.. కేసులు ఎవరి మీద చేశారని ప్రశ్నించారు. పోలీసులు అయినా, అధికారులు అయినా లెక్క రాసి పెట్టు.. ఎక్కువ చేస్తే మిత్తితో చెల్లిస్తామని ఆరోపించారు. చిట్టి నాయుడు వల్ల ఏం కాదు.. ఆయను చూసి మీరు ఎక్కువ చేయకండి అంటూ పోలీసులకు కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు.

Show comments