ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఆరోగ్యంగా ఉండడం కోసం కొన్ని గింజలు ఆహారంలో భాగంగా చేసుకుంటే మేలు జరుగుతుంది. అటువంటి వాటిల్లో వేరుశనగ ఒకటి.
వేరు శనగలను మనం మన ఆహారంలో ఏదో ఒక రకంగా భాగం చేసుకుంటాం. వేరు శనగ నూనె మనం వంటకు ఉపయోగిస్తాం, వేరు శనగలను వేయించి, ఉడికించి ఇలారకరకాలుగా ఆహారంలో భాగం చేసుకుంటాం.
వేరుశనగలలో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. వేరుశనగలను ఆహారంలో భాగంగా తీసుకుంటే మన శరీరానికి కావలసిన ఫైబర్ అందుతుంది. ముఖ్యంగా వేరుశనగలను నానబెట్టి ఉడకబెట్టి తిన్నప్పుడు అందులో ఉండే పోషకాలు మన శరీరానికి ఎంతగానో దోహదం చేస్తాయి.
ఫైబర్ మన శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తాయి.వేరు శనగలలో ప్రోటీన్, ఫైబర్, పాలిఫెనాల్స్, సెలీనియం, మెగ్నీషియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, విటమిన్స్ ఉంటాయి.
వేరుశనగలు ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో ఉండే చక్కర స్థాయిలను నియంత్రించడంలో వేరుశనగ సహాయపడుతుంది. వీటిని రోజూ తింటే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.వేరుశనగలను నానబెట్టడం వల్ల వాటిలో ఉండే పోషకాలు పెరుగుతాయి.
వేరుశనగలు తినేటప్పుడు అవి శరీరం ద్వారా సులభంగా గ్రహించబడతాయి. నానబెట్టిన వేరుశనగలు జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఎంతో బాగా పనిచేస్తాయి. ఉడకబెట్టిన వాటిలో కూడా పోషకాలు ఫుల్ గా ఉంటాయి.
పచ్చి వేరుశనగలను తింటే కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ పచ్చి వేరుశనగలను తినకూడదు. ఇక నానబెట్టి, ఉడకబెట్టిన వేరుశనగలలో మన గుండెకు ఆరోగ్యాన్ని ఇచ్చే మోనో సాచురేటెడ్, పాలి అన్ శాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉంటాయి.
ఉడకబెట్టిన వేరుశనగలలో ఆరోగ్యకరమైన కొవ్వులు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ప్రతిరోజు మనం నానబెట్టిన లేదా ఉడకబెట్టిన వేరుశనగలను కొన్ని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
గుండె పనితీరును మెరుగుపరిచే ఎన్నో పోషకాలు వేరుశనగలలో ఉన్నాయి. వేరుశనగలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి.
ఉడకబెట్టిన వేరుశనగలలో అనేక వ్యాధులను, ఇన్ఫెక్షన్లను నియంత్రించి మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. కనుక వేరు శనగలను నిరభ్యంతరంగా ఆహారంలో భాగం చేసుకోండి. నానబెట్టి, ఉడికించి తినండి.