Site icon NTV Telugu

Congress: కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో రసాభాస

Congress

Congress

Congress: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ నుంచి గాంధీ చౌరస్తా మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ లో భాగంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పాదయాత్రలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్ తో పాటు భారీగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పాదయాత్ర తర్వాత లహరి ఫంక్షన్ హాల్లో ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు.

Read Also: YS Jagan: అందరూ ధోనీల్లా తయారు కావాలి.. పార్టీ నేతలకు జగన్‌ దిశానిర్దేశం

ఇక, కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆందోళన జరిగింది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఇంఛార్జ్ కేకే మహేందర్ స్టేజీ మీద ఉండగానే రసాభాస చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధికార ప్రతినిధి చీటీ ఉమేష్ రావు మాట్లాడుతుండగా పార్టీ నాయకులు అడ్డుకున్నారు. ఎన్నడు పార్టీ కోసం పని చేయని ఉమేష్ రావు వేదిక నుంచి దిగిపోవాలని ఆందోళన చేశారు. దీంతో నిరసనకారులను నాయకులు, పోలీసులు అడ్డుకున్నారు. స్టేజీ పై నుంచి కార్యకర్తలను ఆది శ్రీనివాస్, కేకే మహేందర్ రెడ్డి సముదాయించిన అనంతరం యథావిధిగా సమావేశం కొనసాగింది.

Exit mobile version