Rajanna Sircilla: రేపు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. వేములవాడ రాజన్నను దర్శించుకుని రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేయనున్నారు. వేములవాడ ఆలయ, పట్టణ అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 127.65 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఆలయ విస్తరణ అభివృద్ధితో పాటు పట్టణంలో రోడ్డు వెడల్పు, జిల్లా ఎస్పీ కార్యాలయం, యా రన్ డిపో తో పలు అభివృద్ది పనులకు వర్చువల్ విధానంలో ముఖ్యమంత్రి రేపు శంకుస్థాపనలు చేయనున్నారు. తదనంతరం ఆలయ గుడి చెరువు మైదానంలో బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఇప్పటికే రాజన్న గుడి చెరువు మైదానంలో భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లను ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పర్యవేక్షిస్తున్నారు.
Read also: Warangal: వరంగల్ కు సర్కార్ వరాల జల్లు… పూర్తిగా మారనున్న రూపురేఖలు..
రాష్ట్ర ప్రభుత్వం రూ. 76 కోట్లు కేటాయించారు. ఆలయ ప్రాంగణం విస్తరణ, భక్తులకు అవసరమైన ఆధునిక సౌకర్యాల ఏర్పాటుకు ఈ నిధులను వినియోగించనున్నారు. అలాగే వేములవాడ దేవాలయం నుంచి ములవాగు వంతెన వరకు రోడ్లను విస్తరించేందుకు రూ. 47.85 కోట్లు, మూలవాగు బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల కమాన్ జంక్షన్ వరకు కొత్త డ్రైనేజీ నిర్మాణానికి రూ. 3.8 కోట్ల నిధులు మంజూరయ్యాయి. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం 127 కోట్లు మంజూరు చేయడంతో వేములవాడ పట్టణ ప్రజలు, వేములవాడ రాజన్న భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిధుల మంజూరులో ప్రత్యేకంగా కృషి చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 20న సీఎం వేములవాడ రాక నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా పోలీసు అధికారులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మిడ్ మానేరు రిజర్వాయర్‌లో ఆచరణాత్మకంగా నష్టపోయిన బాధితులకు డబుల్ బెడ్‌రూం ఇండ్లను మంజూరు చేస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
Warangal Police: నేడు వరంగల్‌లో సీఎం పర్యటన.. నిరసనకారులపై పోలీసుల ప్రత్యేక నిఘా..