NTV Telugu Site icon

Bandi Sanjay: మానేరు వాగుపై నూతన బ్రిడ్జి ని ప్రారంభించనున్న బండి సంజయ్..

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay: రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటన కొనసాగుతుంది. గంభీరావుపేట మండలంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఉదయం లింగన్నపేట నుండి కోరుట్ల పేట వరకు డబుల్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం లింగన్నపేట గ్రామంలో ఉదయం 11 గంటలకు మల్లారెడ్డిపేట గ్రామంలో వీరాంజనేయ స్వామిని బండి సంజయ్ దర్శించుకోనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు గంభీరావుపేట మల్లారెడ్డిపేట రహదారి మానేరు వాగు పై నూతన బ్రిడ్జ్‌ ను బండి సంజయ్‌ ప్రారంభించనున్నారు.

Read also: Election Results: మహారాష్ట్రలో బీజేపీ సంచలనం.. జార్ఖండ్‌లో కాంగ్రెస్ కూటమి..

తాజాగా పెద్దపల్లి జిల్లా ఓడేడు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా గర్మిళ్లపల్లి మధ్య దూరాన్ని తగ్గించేందుకు వాగుపై ఈ వంతెనను నిర్మిస్తున్నారు. 2016 ఆగస్టు నెలలో రూ.49 కోట్లతో వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే కాంట్రాక్టర్ల మార్పు, నిధుల కొరత తదితర కారణాలతో నిర్మాణంలో జాప్యం జరుగుతుండడంతో స్థానికులు అక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక మార్గంలో రాకపోకలు సాగిస్తున్నారు. పిల్లర్లు, కాలువల మధ్య బ్యాలెన్సింగ్ కోసం వేసిన చెక్క ముక్కలు దెబ్బతిన్నాయి. ఈ వంతెన నిర్మాణంలో భాగంగా గత వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాలకు బ్రిడ్జి బీమ్‌లు సైతం కొట్టుకుపోయాయి. పిల్లర్లు కూడా దెబ్బతిన్నాయి. ఇటీవల బ్రిడ్జిపై ఉన్న సిమెంటు కాలువలు కూలిపోవడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇవాళ గంభీరావుపేట- మల్లారెడ్డిపేట రహదారి మానేరు వాగు పై నూతన బ్రిడ్జిని బండి సంజయ్ ప్రారంభించనున్నారు. దీంతో గంభీరావుపేట-మల్లారెడ్డిపేట గ్రామస్థులు ఆంనందం వ్యక్తం చేశారు. గంభీరావుపేట- మల్లారెడ్డిపేటకు వెళ్లాలన్నా తీవ్ర ఇబ్బందిగా ఉండేదని ఇప్పడు మానేరు వాగు నూతన బ్రిడ్జితో ఆ సమస్య తీరుతుందని తెలిపారు.
Student Suicide: మియాపూర్ లో విద్యార్థి ఆత్మహత్య.. అనుమానం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు..