NTV Telugu Site icon

Rajanna Sircilla: ఊపిరి ఉండగానే స్మశానంలో పడేశారు.. చివరకు ఏమైందంటే..

Rajanna Sirisilla

Rajanna Sirisilla

Rajanna Sircilla: ప్రాణాలతో ఉన్న వృద్ధురాలిని శ్మశాన వాటికలో వదిలేసిన హృదయ విదారక ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో సంచలంగా మారింది. శ్మశానవాటిక నుంచి మూలుగుతూ శబ్దాలు రావడంతో అటుగా వెళ్తున్న కొందరు స్థానికులు వెళ్లి చూడగా ఓ వృద్ధురాలు కనిపించింది. దీంతో వారు షాక్‌కు గురయ్యారు. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు.

Read also: Cyclone Dana: దానా తుఫాన్‌ ఎఫెక్ట్.. ఈ రోజు ఈ రైళ్లు రద్దు..

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన కూకట్ల రాజవ్వ(60) భర్త కొన్నేళ్ల క్రితం మృతి చెందాడు. వారికి పిల్లలు లేరు. పద్మానగర్ గ్రామపంచాయతీలో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తూ అద్దె ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. కొద్దిరోజుల క్రితం కిడ్నీ ఫెయిల్ కావడంతో తంగళ్లపల్లిలోని తన సోదరుడి కుమారుడి తిరుపతి (అల్లుడు) ఇంటికి వెళ్లింది. ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని తెలిసి బస్వాపూర్, మండేపల్లికి చెందిన రాజవ్వ అక్కచెల్లెళ్లు భూమవ్వ, ఎల్లవ్వ ఆమెను చూసేందుకు తంగళ్లపల్లికి వచ్చారు. ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో సిరిసిల్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రెండు రోజుల చికిత్స అనంతరం ఇంటికి తీసుకెళ్లాలని వైద్యులు చెప్పడంతో రాజవ్వను సోమవారం తంగళ్లపల్లిలోని తిరుపతి ఇంటికి తీసుకెళ్లారు.

Read also: SSRMB 29 : మహేశ్ కోసం రాజమౌళి వేట మొదలైంది..

మీ ఇంటికి తీసుకెళ్తానని చెప్పి మళ్లీ ఇక్కడకు ఎందుకు తీసుకొచ్చారని తిరుపతి అడగడంతో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో రాజవ్వను నేరుగా శ్మశాన వాటికకు తీసుకెళ్లి సోమవారం రాత్రంతా అక్కడే బస చేశారు. శ్మసాన వాటిక నుంచి మూలుగుతున్న శబ్దాలు రావడంతో స్థానికులు వెళ్లి చూడగా షాక్ తిన్నారు. బతికున్న రాజవ్వను అక్కడే పడుకోబెట్టి ఉండటాన్ని చూసి చలించిపోయారు. ఏం జరగిందని అడగటంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మంగళవారం తహసీల్దార్ జయంత్‌కుమార్, ఎస్సై రామ్మోహన్ స్పందించి సిబ్బందిని పంపించి కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ చేసి వృద్ధురాలిని తిరుపతి ఇంటికి తరలించారు.
KTR Testimony: మంత్రి కొండా సురేఖపై కేసులో.. నేడు కేటీఆర్‌ వాంగ్మూలం..