NTV Telugu Site icon

Rajanna Sircilla: బాత్రూంలో ఉండగా వీడియో తీసిన పీఈటీ.. రోడెక్కిన విద్యార్థినిలు

Rajanna Sirisilla

Rajanna Sirisilla

Rajanna Sirisilla: న్యాయం చేయాలంటూ 500 మంది విద్యార్థినులు రోడ్డెక్కిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీలో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో దారుణం వెలుగులోకి వచ్చింది. పీఈటిని సస్పెండ్ చేయాలని ట్రైబల్ సోషల్ వెల్ఫేర్ విద్యార్థినులు డిమాండ్ చేశారు. 500 పైగా విద్యార్థినులకు రెండు బాత్రూంలు మాత్రమే ఉన్నాయని వాపోయారు. విద్యార్థినులకు నెలవారి పీరియడ్ ఉన్న సమయంలో బాత్రూంలో స్నానం చేస్తున్న సమయంలో పీఈటి టీచర్ లేట్ ఎందుకు అవుతుందని డోర్ పగలగొట్టి.. లోనికి వచ్చి తన ఫోన్ తో వీడియో రికార్డు చేస్తూ కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పీఈటి జ్యోత్స్న విద్యార్థినులను పెట్టె ఇబ్బందులు భరించలేక పోతున్నామని వాపోయారు.

Read also: Dhanush: ధనుష్ పై నిషేధం ఎత్తివేత..

పీఈటి సైకో అంటూ .. బైపిసి మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినులు సిరిసిల్ల సిద్దిపేట ప్రధాన రహదారి పై ధర్నాకు దిగామని కన్నీరుమున్నీరుగా విలపించామన్నారు. మేము బాత్రూంలో స్నానం చేస్తున్న సమయంలో లోనికి వచ్చి బట్టలు లేకుండా వీడియోలు తీస్తు బూతులు తిడుతూ కొడుతూ.. తీసుకెళ్తుందని విద్యార్థినులు రోడ్డెక్కి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలేజీలో పార్ట్ టైం జాబ్ చేస్తున్న పిఈటీ జోత్స్న పెట్టే ఇబ్బందులు భరించలేక  ఇందిరమ్మ కాలనీలోని ట్రైబల్ వెల్ఫేర్ విద్యార్థినులు ఉదయం 5 గంటలకు సిరిసిల్ల, సిద్దిపేట ప్రధాన రహదారి పై కూర్చొని ఆందోళన వ్యక్తం చేశారు. కొట్టిన దెబ్బలని చూపిస్తూ విద్యార్థినులు రోదిన్నారు. సైకో టీచర్ ని సస్పెండ్ చేయాలంటూ ఆందోళన చేపట్టారు. ధర్నా చేస్తున్న స్థలానికి చేరుకున్న ఎంఈఓ రఘుపతి,  పోలీసులు హుటా హుటిన చేరుకున్నారు. పిఈటీ జ్యోత్స్నను విధుల నుండి తప్పిస్తున్నామని డీఈఓ హామీతో విద్యార్థినిలు ఆందోళన విరమించారు.
MLA Adimulam case: ఎమ్మెల్యే ఆదిమూలం కేసులో కీలక పరిణామాలు..

Show comments