Site icon NTV Telugu

Raj Gopal Reddy: చౌటుప్పల్ వరదల్లో మునిగిపోతుంటే.. సిరిసిల్ల అభివృద్దా..?

Raj Gopal Reddy

Raj Gopal Reddy

చౌటుప్పల్ వరదలతో మునిగిపోతుంటే సిద్దిపేట సిరిసిల్లలో అభివృద్ధి చేస్తున్నారు దీనిని సమానత్వం అంటారా అని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. చౌటుప్పల్ మండల కేంద్రంలో వీఆర్ఏల నిరవధిక సమ్మెకు సంఘీభావం తెలిపారు. కొన్ని నెలలుగా తమ సమస్యలను పరిష్కరించాలని 23 వేల మంది వీఆర్ఏలు రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తుంటే కేసీఆర్ కు కళ్ళు మూసుకుపోయాయా? అంటూ ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పులకుప్పగా మార్చిండని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో ఆంధ్ర కాంట్రాక్టర్లకు లక్షల కోట్లు దోచి పెట్టిండని విమర్శించారు. ప్రాజెక్టుల రీడిజైన్ పేరు మీద ఆంధ్ర కాంట్రాక్టర్లకు లక్షల కోట్లు కట్టబెట్టిండని విమర్శించారు. 2014లో కేసీఆర్ కొడుక్కి, బిడ్డకి ఒక ఇల్లు కూడా లేదు ఇప్పుడు లక్ష కోట్లకు పడగలెత్తారని ఆరోపించారు. రాష్ట్రంలో కొన్ని కోట్లు ఖర్చుపెట్టి రైతువేదికలు నిర్మించారు, అవి ఇప్పుడు నిరుపయోగంగా మారాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ నియంత పాలనకు మునుగోడు నుండే ప్రజలు చరమగీతం పాడుతారని నిప్పులు చెరిగారు. తెలంగాణలో మలి ఉద్యమం రాబోతుంది. కేసీఆర్ కుటుంబానికి తెలంగాణ ప్రజలకు మధ్య ఉద్యమం ప్రారంభమయిందని మునుగోడు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు.
Hebah Patel: ‘గీతా’విష్కరణ! సెప్టెంబర్ 9 విడుదల!!

Exit mobile version