ఇటీవల రాడిసన్ బ్లూ హోటల్ లోని పబ్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఈ పబ్ లో పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల పిల్లలతో సహా 148 మంది యువతి, యవకులు పట్టుబడ్డారు. అయితే ఇందులో కొందరు డ్రగ్స్ తీసుకన్నట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో ఈ ఘటనపై ప్రభుత్వ విప్ బాల్క సుమన్ స్పందిస్తూ.. కాంగ్రెస్, బీజేపీ నేతల సన్నిహితులే ఈ ఘటనలో ఉన్నారని ఆరోపించారు. అంతేకాకుండా దీనికి నైతిక బాధ్యత వహిస్తూ.. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లు తమ పదవులకు రాజీనామా చేయాలన్నారు. అయితే బాల్క సుమన్ వ్యాఖ్యలకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కౌంటర్ ఇచ్చారు. బాల్క సుమన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. బాల్క సుమన్ చరిత్ర తెలుసుకొని మాట్లాడని, సినీ నటులు అరెస్టు ఐన డ్రగ్స్ కేసు ఏమైంది… ప్రభుత్వం మీదే కదా అని ఆయన ప్రశ్నించారు.
ఆ డ్రగ్స్ కేసులో హీరోయిన్ల పేరు రాకుండా చేశారు కేటీఆర్ అని, పేర్లు వచ్చాయని కేటీఆర్ ఫైల్ ను మూట కట్టి పక్కన పడేసాడన్నారు. 1000 మందితో టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేస్తాను ఇది చేస్తా అది చేస్తా అని సీఎం కేసీఆర్ అన్నాడన్నారు. ఇజ్రాయెల్, అమెరికా నుండి టెక్నాలజీ తీసుక వస్తా అన్నాడు అది ఏమైనదని ఆయన మండిపడ్డారు. బంజారాహిల్స్ లో పట్టుబడిన వారిలో కొంత మంది పైనే ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేశారని, మిగిలిన వారిని ఎందుకు వదిలి పెట్టారని ఆయన ప్రశ్నించారు. గోవా తర్వాత తెలంగాణ డ్రగ్స్ కు అడ్డాగా మారింది అంటే టీఆర్ఎస్ నాయకుల వలనే అని ఆయన విమర్శించారు. డ్రగ్స్ రాకెట్ లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇన్వాల్వ్ అయి ఉన్నారన్నారు.
https://ntvtelugu.com/harish-rao-video-conference-with-health-officers/
