Yellow Alert for Hyderabad: మళ్లీ భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yellow Alert for Hyderabad: రాష్ట్రంలో కొద్దిసేపు ఓదార్పు తర్వాత వరణుడి ప్రతాపం మళ్లీ మొదలైంది. సోమవారం మధ్యాహ్నం నుంచి వాతావరణం కాస్త చల్లబడింది. రాత్రి సమయంలో పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. ఇవాళ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, నగరంలో ఎల్లో అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా కూడా ఇదే విధమైన వాతావరణం కొనసాగుతుంది.కొన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలలో రేపు బుధవారం ఉదయం వరకు 10 మిమీ నుంచి 2.40 మిమీ మధ్య వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. నగరంలోని చాంద్రాయణగుట్ట, రాజేంద్రనగర్, మలక్‌పేట్, ఎల్‌బీ నగర్, చార్మినార్, బండ్లగూడ, యూసుఫ్‌గూడ సహా కొన్ని ప్రాంతాల్లో 2.50 మిల్లీమీటర్ల నుంచి 15.50 మిల్లీమీటర్ల మధ్య వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల రెండు రోజులలో నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ నుండి 32 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుందని, కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ నుండి 23 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండవచ్చని తెలిపింది.
IMD ప్రకారం.. వర్షపాతం కారణంగా రోడ్లు, లోతట్టు ప్రాంతాలలో నీరు చేరే అవకాశం వుందని తెలిపింది. నిన్న సోమవారం నగరంలో వర్షపాతం అంతగా నమోదు కాలేదనే చెప్పొచ్చు. గరిష్ట ఉష్ణోగ్రత 30.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కాగా, ఉదయం 8:30 గంటల వరకు తేమ స్థాయి 73 శాతం సాధారణం కంటే ఎక్కువగా నమోదైంది. నేడు ఆదిలాబాద్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డిలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ఇదే తరహా వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా మహబూబ్‌నగర్‌లో (68.5 మిమీ), రాజన్న సిరిసిల్లలో (61.3 మిమీ), నిర్మల్‌లో 58.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
Muslim couple married in Hindu style: హిందూ సంప్రదాయం ప్రకారం అమెరికన్ ముస్లిం జంట వివాహం
Also Read
- ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
తాజావార్తలు
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
IND vs SL Test: శ్రీలంకలో టీమిండియా ల్యాండ్.. స్టార్ ప్లేయర్ మిస్సింగ్.. మొదటి టెస్ట్ డౌటే!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
Varanasi: మహేష్ పుట్టినరోజుకు ‘వారణాసి’ గిఫ్ట్ ఉంటుందా?.. 80% షూటింగ్ పూర్తయినా పోస్టర్ తో సరిపెట్టుకుంటారా ?
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!