Site icon NTV Telugu

Yellow Alert for Hyderabad: మళ్లీ భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్‌ జారీ చేసిన ఐఎండీ

Yellow Alert For Hyderabad

Yellow Alert For Hyderabad

Yellow Alert for Hyderabad: రాష్ట్రంలో కొద్దిసేపు ఓదార్పు తర్వాత వరణుడి ప్రతాపం మళ్లీ మొదలైంది. సోమ‌వారం మ‌ధ్యాహ్నం నుంచి వాతావ‌ర‌ణం కాస్త చ‌ల్ల‌బ‌డింది. రాత్రి స‌మ‌యంలో ప‌లు ప్రాంతాల్లో చిరుజ‌ల్లులు కురిశాయి. ఇవాళ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, నగరంలో ఎల్లో అలర్ట్‌ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా కూడా ఇదే విధమైన వాతావరణం కొనసాగుతుంది.కొన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలలో రేపు బుధవారం ఉదయం వరకు 10 మిమీ నుంచి 2.40 మిమీ మధ్య వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. నగరంలోని చాంద్రాయణగుట్ట, రాజేంద్రనగర్, మలక్‌పేట్, ఎల్‌బీ నగర్, చార్మినార్, బండ్లగూడ, యూసుఫ్‌గూడ సహా కొన్ని ప్రాంతాల్లో 2.50 మిల్లీమీటర్ల నుంచి 15.50 మిల్లీమీటర్ల మధ్య వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల రెండు రోజులలో నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ నుండి 32 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుందని, కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ నుండి 23 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండవచ్చని తెలిపింది.

IMD ప్రకారం.. వర్షపాతం కారణంగా రోడ్లు, లోతట్టు ప్రాంతాలలో నీరు చేరే అవకాశం వుందని తెలిపింది. నిన్న సోమవారం నగరంలో వర్షపాతం అంతగా నమోదు కాలేదనే చెప్పొచ్చు. గరిష్ట ఉష్ణోగ్రత 30.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కాగా, ఉదయం 8:30 గంటల వరకు తేమ స్థాయి 73 శాతం సాధారణం కంటే ఎక్కువగా నమోదైంది. నేడు ఆదిలాబాద్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డిలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ఇదే తరహా వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా మహబూబ్‌నగర్‌లో (68.5 మిమీ), రాజన్న సిరిసిల్లలో (61.3 మిమీ), నిర్మల్‌లో 58.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
Muslim couple married in Hindu style: హిందూ సంప్రదాయం ప్రకారం అమెరికన్ ముస్లిం జంట వివాహం

Exit mobile version