NTV Telugu Site icon

తెలంగాణ‌లో మ‌రో రెండు రోజులు వ‌ర్షాలు

Rains

తెలంగాణ‌లో అకాల వ‌ర్షాలు కురుస్తూనే ఉన్నాయి.. గ‌త వారం రోజులుగా కురుస్తున్న వ‌ర్షాల‌తో ప‌లు ప్రాంతాల్లో పంట‌ల‌కు తీవ్ర న‌ష్ట‌మే జ‌రిగింది.. కొన్ని ప్రాంతాల్లో వ‌డ‌గ‌ళ్లు.. రైతుల‌కు క‌డ‌గ‌ళ్లు మిగిల్చాయి.. అయితే, మ‌రో రెండు రోజుల పాటు రాష్ట్రంలో వ‌ర్షాలు కురుస్తాయ‌ని సూచించింది హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం.. నిన్నటి నుంచి ఉన్న ఉత్తర- దక్షిణ ఉపరితల ఆవర్తనం, మరత్వాడా నుండి ఇంటీరియర్ కర్ణాటక, తెలంగాణ, రాయలసీమ మీదగా దక్షిణ కోస్తా తమళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీట‌ర్ల ఎత్తు వరకు స్థిరంగా కొన‌సాగుతుండ‌గా.. రాష్ట్రంలో ఈ రోజు పొడి వాతావరణం ఉండే అవకాశాలు ఉన్నాయ‌ని.. తదుపరి రెండు రోజులు అంటే 26, 27వ తేదీల్లో రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వ‌ర్షం.. ఒకటి రెండు చోట్ల కురుసే అవ‌కాశం ఉంద‌ని సూచించింది..