NTV Telugu Site icon

తెలంగాణ‌లో ఈ రోజు, రేపు భారీ వ‌ర్షాలు

Rains

ఈ రోజు, రేపు తెలంగాణ‌లోని ప‌లు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు మ‌రియు ఈదురు గాలుల‌తో కూడిన భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చ‌రిక‌లు జారీ చేసింది.. నిన్నటి ఝార్ఖండ్ మ‌రియు పరిసర ప్రాంతాలలో ఉన్న అల్పపీడనము ఈరోజు తెలంగాణ నుండి దూరంగా వెళ్ళిపోయింది. నైరుతి రుతువనాలు తెలంగాణాపై చురుకుగా కదులుతున్నవ‌ని.. ఈ రోజు క్రింది స్థాయి నుండి పశ్చిమ గాలులు బలంగా వీస్తున్నాయ‌ని.. వీటి ప్ర‌భావంతో.. రాగల మూడు రోజులు (15,16,17వ తేదీలు) తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్ని ప్రాంతాల్లో కురిసే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌క‌టించింది.. ఇక‌, ఈ రోజు, రేపు అన‌గా 15,16వ తేదీల్లో ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులతో కూడిన వర్షం తెలంగాణలో కొన్ని జిల్లాలలో ఒకటి, రెండు చోట్ల వచ్చే అవకాశం ఉంద‌ని.. ఒకటి రెండు ప్రదేశాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని వెల్ల‌డించింది.