NTV Telugu Site icon

Weather Forecast: నేడు తెలంగాణలో పలుచోట్ల వర్షాలు.. రేపు అక్కడక్కడ వడగాల్పులు

Telangana Wether

Telangana Wether

Weather Forecast: తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహానగరం, మెదక్, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని స్పష్టం చేశారు.

హైదరాబాద్‌లో నేడు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, సాయంత్రం లేదా రాత్రి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో పలుచోట్ల వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రేపటి నుంచి 18వ తేదీ వరకు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పారు.

Read also: Sai Dharam Tej: ఆ హీరోయిన్ తో సాయి ధరమ్ తేజ్ ప్రేమాయణం?

అయితే నైరుతి రుతుపవనాలు ఏపీని తాకనున్నాయి. వారం రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరిస్తాయి. నైరుతి రుతుపవనాలు తెలంగాణకు చేరుకోవడానికి మరికొన్ని రోజులు పట్టనుంది. ఈ నెల 18న తెలంగాణను తాకే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు. వీటి ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయి. నైరుతి రుతుపవనాలు ఎప్పుడో తెలంగాణలోకి రావాల్సి ఉండగా కేరళ, ఏపీల్లోకి ప్రవేశించడంలో జాప్యం జరిగింది. దీంతో రాష్ట్రంలో నైరుతి రాక కూడా ఆలస్యమైంది. నైరుతి రుతుపవనాల వల్లే ఎక్కువ వర్షాలు కురుస్తున్నాయి.

రైతులు కూడా ఈ సమయంలో పంటలు వేస్తారు. తద్వారా వ్యవసాయ రంగానికి నైరుతి రుతుపవనాలు కీలకమని చెబుతున్నారు. వర్షాధార పంటలపై ఆధారపడిన రైతులు నైరుతి రుతుపవనాల కోసం ఎదురుచూస్తున్నారు. నైరుతి రుతుపవనాలు వచ్చే వారం తెలంగాణను తాకే అవకాశం ఉంది. ఇది రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు వ్యాపించడానికి దాదాపు ఏడు రోజుల సమయం పడుతుంది. జూన్ నెలాఖరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
Xiaomi Electric Car: షియోమీ నుంచి మొదటి ఎలక్ట్రిక్ కారు.. సూపర్ లుకింగ్! కొనకుండా అస్సలు ఉండలేరు