Site icon NTV Telugu

Heavy rain in Hyderabad: బంగాళాఖాతంలో అల్పపీడనం.. హైదరాబాద్‌ పలు ప్రాంతాల్లో వర్షం

Heavy Rain In Hyderabad

Heavy Rain In Hyderabad

Heavy rain in Hyderabad: రాష్ట్రంలో కొద్దిసేపు ఓదార్పు తర్వాత వరణుడి ప్రతాపం మళ్లీ మొదలైంది. గురువారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉన్నది. మబ్బులు క్రమంగా నగరం మొత్తం విస్తరించడంతో వానకురుస్తున్నది. ఇక బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, సోమాజిగూడ, అమీర్‌పేట, బోరబండ, ఎర్రగడ్డ, సనత్‌నగర్‌, ఎస్‌ఆర్‌ నగర్‌, వెంగల్‌రావునగర్‌, మైత్రివనం, నాంపల్లి, లక్డీకపూల్‌, ఖైరతాబాద్‌, ముషీరాబాద్‌, చిక్కడపల్లి, లోయర్‌ ట్యాంక్‌బండ్‌, బాగ్‌లింగంపల్లి, కవాడిగూడ, బోలక్‌పూర్‌, దోమలగూడ, గాంధీనగర్‌, జవహర్‌నగర్‌, శంషాబాద్‌, ఆరాంఘర్‌, రాజేంద్రనగర్‌, అత్తాపూర్‌, కిస్మత్‌పూర్‌, గండిపేట్‌, మణికొండ, నార్సింగి, మియాపూర్‌, చందానగర్‌, చాంద్రాయణగుట్ట, బార్కస్‌లో వర్షం కురుస్తున్నది.

Read also: Anesthetic Injection: ఖమ్మంని కమ్మేసిన మత్తు.. వెలుగులోకి మరో ‘సూది హత్య’

ఈనేపథ్యంలో.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈశాన్య మధ్యప్రదేశ్‌ పరిసర ప్రాంతాల వద్ద స్థిరంగా కొనసాగుతున్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక రాగల 48 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదలనుందని.. దీని ప్రభావంతో నేడు ఆదిలాబాద్‌, కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. ఈనెల 25 వరకు పలు ప్రాంతాల్లో మోస్తరు వానలు కురిసే వీలుందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా వుండాలని పేర్కొంది. అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించించి. సోమ‌వారం మ‌ధ్యాహ్నం నుంచి వాతావ‌ర‌ణం కాస్త చ‌ల్లబ‌డటంతో..  నగరంలో ఎల్లో అలర్ట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా కూడా ఇదే విధమైన వాతావరణం కొనసాగుతుంది. కొన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది.

 Anesthetic Injection: ఖమ్మంని కమ్మేసిన మత్తు.. వెలుగులోకి మరో ‘సూది హత్య’

Exit mobile version