NTV Telugu Site icon

TS Weather: తెలంగాణకు వర్షసూచన.. వెదర్ బులిటెన్ విడుదల చేసిన వాతావరణశాఖ

Ts Rain

Ts Rain

TS Weather Bulletin: తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీనికి సంబంధించి శుక్రవారం రాత్రి వాతావరణ బులెటిన్‌ను విడుదల చేసింది. ఈరోజు ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తన ప్రకటనలో తెలిపింది. రేపటి (9)నుంచి 12వ తేదీ వరకు కొన్ని చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఈరోజు హైదరాబాద్‌లో జల్లులు పడే అవకాశం ఉంది. సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని స్పష్టం చేశారు. శుక్రవారం నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ లో 74.8, కొమరం భీం జిల్లా జైనూర్ లో 74, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో 65 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Read also: PM MODI: వరంగల్‌లో ప్రధాని మోడీ సభ.. పరిసర ప్రాంతాల్లో డ్రోన్ లపై నిషేధం

ఉష్ణోగ్రతల విషయానికి వస్తే.. నిన్న నల్గొండలో అత్యధికంగా 35 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత హయత్ నగర్‌లో 21 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదవుతుండగా, కనిష్ట ఉష్ణోగ్రతలు 25 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. హైదరాబాద్‌లో గరిష్టంగా 30.7, కనిష్టంగా 23.7 డిగ్రీల సెల్సియస్, గరిష్టంగా 32, ఖమ్మంలో కనిష్టంగా 26, గరిష్టంగా 32.6, మెదక్‌లో కనిష్టంగా 22 డిగ్రీల సెల్సియస్. నల్గొండలో గరిష్టం 34, కనిష్టంగా 22.4 డిగ్రీలు, గరిష్టంగా 32, నిజామాబాద్‌లో 24.4, గరిష్టంగా 32.2, రామగుండంలో కనిష్టంగా 24.2 డిగ్రీలు నమోదయ్యాయి.
PAN- Aadhaar Link: పాన్ ఆధార్ లింక్ చేయలేదా? మీరు ఈ 15 పనులు ఒక చేయలేరు

Show comments