Indian Racing League: హైదరాబాద్ లో ఇండియన్ రేసింగ్ లీగ్ కు బ్రేక్ పడింది. ఎన్టీఆర్ గార్డెన్స్, ప్రసాద్ ఐమాక్స్ పరిసరాల్లో చిరు జల్లులు కురవడంతో ఇప్పటి వరకు జరగాల్సిన ప్రాక్టీస్ రేస్ ఆలస్యం కానుంది. మెయిన్ రేస్ మధ్నాహ్నం 3 గంటల నుండి ప్రారంభం కానుంది. ఇవాళ, రేపు ఇండియన్ రేసింగ్ లీగ్ చివరి సిరీస్ కు సాగర్ తీర ప్రాంతంలో కార్ రేసింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే జల్లులు కురవడంతో.. రేస్ కు అంతరాయం ఏర్పడింది. దీంతో రేస్ వీక్షించేందుకు వచ్చినవారు తీవ్ర నిరాశకు చెందారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న జరగనున్న ఫార్ములా ఈ-కార్ రేస్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ సన్నద్దతలో భాగంగా.. ఇండియన్ రేసింగ్ లీగ్ నిర్వహిస్తున్నారు. అయితే.. ఇవాల్టి నుంచి పెట్రోల్ కార్లతో జరిగే రేసింగ్‌లో 12 కార్లు, 6 బృందాలు పాల్గొననున్నాయి. ఇందులో స్వదేశీ, విదేశీ రేసర్లు ఉన్నారు. పెట్రోల్ కార్లు 240 స్పీడ్‌తో వెళ్తాయని, ఎలక్ట్రిక్ కార్లయితే మాగ్జిమమ్ స్పీడ్ 320 వరకూ ఉంటుందని నిర్వహకులు తెలిపారు. రేసింగ్‌ను 7,500 మంది వరకూ వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. పార్కింగ్, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. ఆదివారం ఒక స్ప్రింట్, మరో ఫీచర్ రేసును నిర్వహిస్తారు. ఇక.. గత నెల 19, 20 తేదీల్లో హైదరా బాద్ లో తొలి రౌండ్ జరిగింది.
Read also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
ఇందులో భాగంగా.. రెండో రోజు పోటీల్లో చెన్నై టర్బో రైడర్స్, గోవా ఏసెస్ కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో హైదరాబాద్ స్ట్రీట్ సర్క్యూట్‌ను అర్ధంతరంగా నిలిపివేశారు. ట్రాక్లో ఎలాంటి మార్పులు చేయట్లేద కఠినమైన భద్రత నిబంధనల్ని పాటిస్తూ తుది దశ పోటీల్ని పూర్తిచేస్తామని నిర్వాహకులు వెల్లడించారు. ఇండియాలో మొదటి సారి జరుగుతున్న లీగ్ రేస్‌లను హైద్రాబాద్, చెన్నైలో నిర్వహిస్తున్నారు. అయితే మొదటి రౌండ్ హైదరాబాద్ లో నిర్వహణ లోపం కారణంగా రేస్ జరగలేదు. ప్రాక్టీస్ రేస్‌లతోనే ముగిసింది. ఇవాళ వర్షం కారణంగా ప్రాక్టీస్ కు అంతరాయం ఏర్పడటంతో అక్కడకు చూసేందుకు వచ్చిన వారికి కాస్త నిరాసకు లోనయ్యారు. మళ్లీ మధ్నాహ్నం వరకు జల్లులు బ్రేక్ వస్తే రేస్ మొదలవుతుందని అధికారులు వెల్లడించారు.
TiE Global Summit: అంతర్జాతీయ సదస్సుకు మరోసారి వేదిక కాబోతోన్న హైదరాబాద్
