NTV Telugu Site icon

Rain Alert: నేడు, రేపు భారీ వర్షాలు..

Rain Alert

Rain Alert

తెలంగాణలో మరో రెండు రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది… కర్ణాటక ఉత్తర ప్రాంతంపై నుంచి శ్రీలంక వరకూ 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితలద్రోణి ఏర్పడింది.. రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయని.. ఆ రెండింటి ప్రభావంతో.. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో శని, ఆదివారాల్లో తెలంగాణలో భారీవర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అంచనా వేసింది.. ఇక, జులై నుంచే ఈ సారి భారీ వర్షాలు, వరదలు చాలా ప్రాంతాలను అతలాకుతలం చేశాయి.. గోదావరి పరివాహక ప్రాంతాలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యాయి.. ఆగస్టులోనూ వర్షాలు కురుస్తూ వచ్చిన.. కొన్ని రోజుల పాటు తెరపి ఇచ్చాయి.. ఇదే సమయంలో హైదరాబాద్‌ సహా మరికొన్ని ప్రాంతాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి.. రాత్రి పూట ఉక్కపోత కూడా పెరిగింది.. అయితే, మరోసారి మళ్లీ వర్షాలు దంచికొడుతున్నాయి.. గత రెండు రోజులుగా తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి.. గురువారం, శుక్రవారం కొన్ని ప్రాంతాల్లో వానలు పడ్డాయి. ఫణిగిరిలో అత్యధికంగా 12.6 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా.. గుండాలలో 10.2, భీమవరంలో 8.9, వీపనగండ్లలో 8.9, నాగారంలో 8.2, పడమటిపల్లెలో 6.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.. ఇక, ఇవాళ, రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం.

Read Also: Petrol Tanker: ఖమ్మంలో అదుపుతప్పిన ట్యాంకర్‌.. పెట్రోల్‌ ఖాళీ చేసిన జనం..!

Show comments