Site icon NTV Telugu

అలెర్ట్ : మరో మూడు రోజుల పాటు ఉరుములతో కూడిన వర్షాలు

Rains

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో రాగల 2 నుండి 3 రోజులలో ఋతుపవనాలు పూర్తిగా ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి. నిన్న మరత్వాడ నుండి ఉత్తరా ఇంటీరియర్ కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 1.5కి వరకు ఉన్న ద్రోణి ఈ రోజు బలహీనపడినది. ముఖ్యంగా ఈ రోజు క్రింది స్థాయి గాలులు పశ్చిమ దిశ నుండి తెలంగాణా రాష్ట్రంలోకి వస్తున్నవి. దీంతో తేలికపాటి నుండి మోస్తరు వర్షములు ఈ రోజు (08వ.తేదీ) ఒకటి రెండు ప్రదేశములలో, మరియు రేపు, ఎల్లుండి (09,10వ తేదీలు) కొన్ని ప్రదేశములలో వచ్చే అవకాశములు ఉన్నాయి. రాగల 3 రోజులు (08,09,10వ.తేదీలు) ఉరుములు మరియు మెరుపులు మరియు ఈదురు గాలులు (గాలి వేగం గంటకి 30 నుండి 40 కి మి)తో కూడిన వర్షం తెలంగాణాలోని ఒకటి, రెండు ప్రదేశములలో (ఈ రోజు, రేపు ఉత్తర, తూర్పు జిల్లాలలో)వచ్చే అవకాశములు ఉన్నాయి. 11న ఏర్పడబోయే అల్పపీడన ప్రభావంతో 11,12, 13 తేదీలలో తెలంగాణ అంతటా విస్తారంగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. కొన్ని ఉత్తర, తూర్పు జిల్లాలలో భారీ మరియు భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి.

Exit mobile version