హైదరాబాద్ లో ఇవాళ వేకువజాము నుంచి వర్షం పడుతోంది. సరిగ్గా ఉదయం 3 గంటలకు ప్రారంభమైన ఈ వర్షం… ఇంకా కొనసాగుతోంది. ముఖ్యంగా ఎల్బీనగర్, ఉప్పల్, దిల్ సుఖ్‌నగర్, కోటి, నాంపల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట్, ఎస్సార్ నగర్, కూకట్ పల్లి, కొండాపూర్, నారాయణగూడ, హయత్ నగర్ తదితర ప్రాంతాల్లో ఇవాళ తెల్లవారు జాము నుంచి వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.
read also : బీజేపీ దూకుడు…త్వరలో బండి సంజయ్ పాదయాత్ర !
దీంతో జిహెచ్ఎంసి సిబ్బంది అప్రమత్తం అయ్యారు. ఇక దక్షిణ ఒడిశా, పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 0.9 కిలో మీటర్ల నుంచి 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి వ్యాపించి ఉన్నది. పశ్చిమ, వాయువ్య దిశల నుంచి రాష్ట్రంలో కిందిస్థాయి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.
