NTV Telugu Site icon

Uttam Kumar Reddy: 23న తెలంగాణలోకి రాహుల్ పాదయాత్ర.. ఆ..మూడు రోజులు బ్రేక్

Uttamkumar Reddy

Uttamkumar Reddy

Uttam Kumar Reddy: కాంగ్రెస్ లో అంతర్గత ప్రజా స్వామ్యం ఎంత బలంగా ఉందొ అనేది ఖర్గే ఎన్నిక నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. ట్రాక్ రికార్డ్ ఉన్న నాయకుడు అధ్యక్షుడు కావడం గర్వ కారణమని అన్నారు. భారత్ జోడో యాత్ర దేశ చరిత్రలో అద్భుతమని తెలిపారు. దేశ చరిత్ర లో నిలిచిపోతుందని అన్నారు. తెలంగాణలో కూడా మిగిలిన రాష్ట్రాల్లో కంటే బాగా నిర్వహిస్తామన్నారు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి. రాహుల్ గాంధీ ఇంటరాక్షన్ వ్యవహారం చూస్తామని తెలిపారు. 2023 లో తెలంగాణలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. 2024 లో కేంద్రంలో అధికారం ఖాయమన్నారు. రాహుల్ గాంధీ హామీలు కూడా ఇస్తారు పాదయాత్రలో అని ఉత్తమ్‌ కుమార్‌ తెలిపారు. 23 న తెలంగాణ లోకి పాదయాత్ర వస్తుందని.. కానీ.. దీపావళి సందర్భంగా.. మూడు రోజులు బ్రేక్ ఉంటుందని అన్నారు. ఇక 27 నుండి పాద్రయాత్ర కొనసాగుతుందని అన్నారు.

Read also: Golden Jubilee: డైలాగ్ కింగ్ యాభై యేళ్ళ నట ప్రస్థానం!

7 నవంబర్ వరకు పాదయాత్ర వుంటుందని అన్నారు. తెలంగాణలో నిరుద్యోగ సమస్యలపై రాహుల్ గాంధీ మాట్లాడుతారని అన్నారు. మునుగోడులో ఉప ఎన్నికల్లో భాగంగా.. బీజేపీ..టీఆర్‌ఎస్‌ లు సిగ్గు, శరం వదిలేశాయని అన్నారు. మునుగోడులో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయని మండిపడ్డారు. పోటీ పడి డబ్బులు పంపిణీ చేస్తున్నాయని ఆరోపించారు. దోపిడీ చేసిన సొమ్ముతో ఎన్నికలు గెలవాలని బీజేపీ, టీఆర్‌ఎస్‌ చూస్తున్నాయని మండిపడ్డారు. రాజకీయం దిగజారి పోవడంలో కేసీఆర్ దే పెద్దచేయని విమర్శించారు. టీఆర్‌ఎస్‌.. వచ్చిన తర్వాత ఎన్నికల అధికారులు కూడా వీక్ గా ఉన్నారని ఎద్దేవ చేశారు. నిబంధనలు పాటించేలా చర్యలే లేవని మండిపడ్డాడు. కేంద్ర ఎలక్షన్ కమిషన్ చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇట్లా అయితే.. ఎన్నికలను వేలం పెట్టుకుంటే ఐపోయేది కాదా సంచళన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రక్రియ అపహస్యము చేస్తున్నాయని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మండిపడ్డారు.