Rahul Gandhi: నేడే రాష్ట్రానికి రాహుల్ గాంధీ.. ఐదు నియోజకవర్గాల్లో ప్రచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ ఈరోజు తెలంగాణలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఒకేరోజు ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. పినపాక, పరకాల, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, రాజేంద్ర నగర్లలో రాహుల్ గాంధీ ప్రచారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1.55 గంటలకు హెలికాప్టర్ ద్వారా నర్సంపేటకు చేరుకుంటారు. నర్సంపేట బహిరంగ సభలో పాల్గొని నర్సంపేట నుంచి హెలికాప్టర్లో 3.40 గంటలకు మామునూరు విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం వరంగల్ చౌరస్తా నుంచి జేపీఎన్ రోడ్డు, మండిబజారు మీదుగా పోచమ్మమైదాన్ వరకు పాదయాత్రలో పాల్గొంటారు.
ఆ తరువాత పోచమ్మమైదాన్ సెంటర్లో జరిగే కార్నర్ మీటింగ్ లో రాహుల్ గాంధీ మాట్లాడనున్నారు. ఇక సాయంత్రం 5.15 గంటకు హెలికాప్టర్లో రాహుల్ గాంధీ హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. ఈ ప్రచారం వరంగల్ తూర్పు నుండి పశ్చిమ వరకు కూడా నడుస్తుంది. ఇక్కడ ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం రాహుల్ హెలికాప్టర్ లో హైదరాబాద్ చేరుకుని అక్కడి నుంచి నేరుగా జయపూర్ వెళతారు. మరోవైపు బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో మల్లికార్జున్ ఖర్గే ఈరోజు ఉదయం 10 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. 11 గంటలకు గాంధీభవన్ ఖర్గే చేరుకుంటారు. మధ్యాహ్నం 11-12 గంటల మధ్య టీపీసీసీ మేనిఫెస్టో కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు కుత్బుల్లాపూర్ మున్సిపల్ మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. రాత్రి హైదరాబాద్‌లోనే బస చేయనున్నారు.
Also Read
- కొండా సురేఖను బీఆర్ఎస్లోకి రానివ్వం.. తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం: జగదీష్ రెడ్డి
- Raids: మాదాపూర్‌లో నిషేధిత ఈ-సిగరెట్లు, వేప్స్ దందాపై దాడులు.. రెండు ఔట్లెట్లపై జాయింట్ రైడ్స్..
- Mahesh Kumar Goud: కొండా సురేఖ బర్తరఫ్‌పై తొలిసారి స్పందించిన పీసీసీ చీఫ్!
- Baswaraju Saraiah: దమ్ముంటే రాజీనామా చేసి ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలి.. కొండా సురేఖకు ఎమ్మెల్సీ సారయ్య సవాల్!
21వ తేదీ తర్వాత ప్రచారం…
తెలంగాణ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార గడువు ఈ నెల 21తో ముగియనుంది. దీని తర్వాత రాహుల్ గాంధీ తెలంగాణలో ఐదు రోజుల పాటు ప్రచారం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. కనీసం 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన పర్యటించే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఇతర ఏఐసీసీ అగ్రనేతలు కూడా 21 తర్వాత తమ పూర్తి సమయాన్ని తెలంగాణకే కేటాయిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Assembly Election 2023: ఓటేయాలంటే ఇవి ఉండాల్సిందే.. ఓటరు జాబితాలో మీ పేరు, పోలింగ్ కేంద్రం చెక్ చేస్కోండి
తాజావార్తలు
-
Ind Vs Japan: చరిత్రలో తొలిసారి.. భారత్–జపాన్ మధ్య టీ20 పోరు..
-
Jewar Toll Plaza: కేంద్రం గుడ్‌న్యూస్.. 14 ఏళ్ల డిమాండ్‌కు పరిష్కారం.. అక్కడ టోల్ ఫ్రీ ప్రయాణం..
-
Delhi: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. రోడ్లు జలమయం
-
AP Theatres Crisis: టికెట్ ధరలు పెంచొద్దు.. ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరం కీలక డిమాండ్లు..
-
Nepal Floods: 170 మీటర్ల లోతులో 9 రోజులు.. “మహామంత్రం” జపిస్తూ ప్రాణాలతో బయటపడ్డ నేపాల్ కార్మికుడు..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!