Rahul Gandhi: తెలంగాణలో రాహుల్ గాంధీ బస్సు యాత్రకు బ్రేక్ పడింది. అత్యవసర సమావేశం ఉండడంతో రాహుల్ గాంధీ ఈరోజు ఢిల్లీకి వెళ్లనున్నారు. కావున బస్సు యాత్రలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. నేడు నిజామాబాద్‌లో సాయంత్రం జరగాల్సిన పాదయత్ర క్యాన్సిల్ అయింది. ఇవాళ ఆర్మూరులో పసుపు, చెరుకు రైతులతో రాహుల్ ముఖాముఖీ సమావేశం అవుతారు. అనంతరం బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. అత్యవసర సమావేశం ఉండడంతోనే రాహుల్ ఢిల్లీకి వెళ్తున్నట్లు సమాచారం
నేడు రాహుల్ షెడ్యూల్..
ఇవాళ ఉదయం 8.30 గంటలకు కరీంనగర్ లోని వీపార్క్ హోటల్ నుంచి బయలుదేరనున్న రాహుల్ గాంధీ ఉదయం 9 గంటలకు చొప్పదండి అసెంబ్లీ నియోజక వర్గం గంగాధర దగ్గర సమావేశం కానున్నారు. ఉదయం 9.30 గంటలకు కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఉదయం 11 గంటలకు జగిత్యాల పట్టణంలో కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు. అనంతం మధ్యాహ్నం 12గంటలకు వేములవాడ నియోజక వర్గం మేడిపల్లిలో సమావేశంలో పాల్గొననున్నారు. కోరుట్లలో మధ్యాహ్నం 1గంటకు సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ముక్కస్ కన్వేషన్ లో భోజన విరామం తీసుకోనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఆర్మూర్ పట్టణంలో కాంగ్రెస్ తలపెట్టిన సభలో పాల్గొని రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు.
ఈ సభ అనంతరం అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ కు వచ్చి.. అక్కడి నుంచి నేరుగా ఢిల్లీకి విమానంలో రాహుల్ గాంధీ వెళ్లనున్నారు. అయితే రాహుల్ గాంధీ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోనున్న నేపథ్యంలో ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు చేపట్టారు. ఆలయానికి రాహుల్ గాంధీ రానున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి సంఘటనలు చోటుచేసుకోకుండా ట్రాఫిక్ ను మళ్లించారు అధికారులు.
Astrology: అక్టోబర్ 20, శుక్రవారం దినఫలాలు