Site icon NTV Telugu

తెలంగాణలో రాహుల్‌ గాంధీ పర్యటన…!

తెలంగాణపై కాంగ్రెస్‌ అధిష్టానం దృష్టి సారించింది. కొత్త కార్యవర్గం ఏర్పాటు తర్వాత కాంగ్రెస్‌ పెద్దలు తెలంగాణ టూర్‌కి రెడీ అవుతున్నారు. సెప్టెంబర్‌ రెండో వారంలో రాహుల్‌ గాంధీ రాష్ట్రానికి రానున్నట్లు తెలుస్తోంది. వరంగల్‌లో లేదా మహబూబాబాద్‌లో రాహుల్‌ సభ ఉంటుందని టీ పీసీసీ వర్గాలు చెప్తున్నాయి. సెప్టెంబర్‌ 17న సభ నిర్వహించాలని ప్లాన్‌ చేస్తున్నారు. రాహుల్‌ గాంధీ ఇచ్చే సమయాన్ని బట్టి డేట్‌ మారే అవకాశం ఉందని తెలంగాణ పీసీసీ నేతలు చెప్తున్నారు.

Read Also : వైష్ణవ్ తేజ్ చిత్రం టైటిల్ ఖరారు


ఇక అటు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేసేందుకు కాంగ్రెస్‌ స్పీడు పెంచింది. ఇవాళ సోనియా గాంధీ విపక్షాల నేతలతో వర్చువల్‌గా సమావేశం కానున్నారు. దేశంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు చెందిన కీలక నేతలతో పాటు పలువురు సీఎంలు కూడా హాజరయ్యే అవకాశం ఉన్న ఈ భేటీలో.. ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించనున్నారు. ఇప్పటికే సోనియా పలు విపక్షాల సీఎంలకు సహా, పలవురు కీలక నేతలకు ఆహ్వానాలు పంపారు. ఈ సమావేశంలో దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలతో పాటు… వచ్చే ఏడాదిలో జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వ్యూహంపై చర్చించే అవకాశముంది

Exit mobile version