NTV Telugu Site icon

Rahul Gandhi: ఢిల్లీలో మీకోసం నేనున్నాను.. సైనికునిలా పోరాడుతా..

Rahula Gandhi Karim Nagar Sabha

Rahula Gandhi Karim Nagar Sabha

Rahul Gandhi: ఢిల్లీలో మీకోసం పోరాడడానికి నేను సైనికుని లాగా ఉన్నానని రాహుల్ గాంధీ అన్నారు. జగిత్యాల కార్నర్ మీటింగ్ లో రాహుల్ మాట్లాడుతూ.. లోక్ సభ సభ్యత్వం రద్దు చేశారని.. రాహుల్ ఉంటున్న ఇల్లు తీసుకున్నారని మండిపడ్డారు. మీ ఇల్లు అవసరం లేదు తీసుకోండి.. దేశమంతా నా ఇల్లే అని చెప్పిన అని అన్నారు రాహుల్.. బీసీ జన గణన చేయడానికి మోడీ కేసీఆర్ సిద్ధంగా లేరన్నారు. ఈ ఎన్నిక దొరల తెలంగాణ, ప్రజాతెలంగాణ కు నడుమ మధ్య జరుగుతున్న పోరని అన్నారు. మీరు కోరుకున్నది ప్రజా తెలంగాణ, కానీ వచ్చింది దొరల తెలంగాణ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. చక్కర ఫ్యాక్టరీని కేసీఆర్ సర్కార్ ముసివేయించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయగానే ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ ని తెర్పిస్తామన్నారు. పసుపుకు మద్దతు ధర కల్పిస్తామన్నారు. దేశంలో ఉన్న డబ్బు అంత ఆదాని చేతులోకి పోయేలా మోడీ, కెసిఆర్ పనిచేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఓబీసీ గణన దేశవ్యాప్తంగా చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రములో కుల గణన చేస్తామన్నారు. ఢిల్లీలో మీకోసం పోరాడడానికి సైనికుని లాగా ఉన్నానని రాహుల్ తెలిపారు. జీవన్ రెడ్డి ఆత్మ నాలుగు దశాబ్దాల నుండి జగిత్యాల ప్రజలతో పెనవేసుకుందన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి రాహుల్ వ్యాఖ్యలు చేశారు. అడవిలో సింహాలు ఒంటరిగా కనిపిస్తాయని అన్నారు. కానీ తెలంగాణ కాంగ్రెస్ లో చాలా పులులు కలిసికట్టుగా బీఆరెస్ తో పోరాడుతున్నాయన్నారు. తెలంగాణ కాంగ్రెస్ గబ్బర్ షేర్ అన్నారు. ఇక కేసీఆర్ ఆటకట్టించడం ఖాయమన్నారు. ఇక్కడితో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాహుల్ విజయభేరీ యాత్ర ముగిసింది. కోరుట్ల, మెట్ పల్లి పట్టణాల్లో ప్రజలకు అభివాదం చేస్తూ రాహుల్ యాత్ర సాగింది. నిజామాబాద్ జిల్లాలో రాహుల్ విజయభేరీ యాత్ర ప్రవేశించింది. రాహుల్ యాత్రకు ప్రజలు సాదరంగా ఆహ్వానించారు. గల్లీ గల్లీలో రాముల్ కు ఘన స్వాగతం పలికారు. ఆర్మూర్ కార్నర్ మీటింగ్ లో మాట్లాడనున్నారు రాహుల్ గాంధీ. కాగా.. రాహూల్ గాంధీ సమక్షంలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్, ముదోల్ మాజీ ఎమ్మెల్యే నారాయణ రావు పాటిల్ కాంగ్రెస్ లో చేరనున్నారు. మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర రావు సైతం చేరే అవకాశం ఉందని సమాచారం. మీటింగ్ తరువాత డిగ్రీ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకోనున్న రాహుల్. అక్కడి నుంచి హెలి క్యాప్టర్ ద్వారా హైదరాబాద్ కు పయనం కానున్నారు.
Kolkata: కాపురంలో ‘కారు’ చిచ్చు.. భార్యను కొట్టిన చంపిన భర్త