Site icon NTV Telugu

Rahul Gandhi: దూకుడు పెంచింది కాంగ్రెస్.. మూడు నియోజకవర్గాల్లో రాహుల్ ప్రచారం..

Rahul Ganadi

Rahul Ganadi

Rahul Gandhi: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. తెలంగాణ కోసం ఒకరి తర్వాత ఒకరు జాతీయ నాయకుల క్యూ కడుతున్నారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఇవాళ మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 1 గంటలకు అందోల్‌ సభ, 2.30 గంటలకు సంగారెడ్డిలో నూక్కడ్‌, సాయంత్రం 4.15 గంటలకు కామారెడ్డి సమావేశంలో రాహుల్‌ పాల్గొంటారు. అనంతరం రాష్ట్ర స్థాయి నేతలతో మాట్లాడి ఎన్నికల పరిస్థితులపై చర్చించి దిశానిర్దేశం చేయనున్నారు.

Read also: Barrelakka: బర్రెలక్కకు ‘మా’ మద్దతు.. బేషరతుగా శిరీషకి సపోర్ట్

కాగా, రాహుల్ పర్యటన దృష్ట్యా నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అంతేకాకుండా కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భాగెల్ కూడా ఈరోజు తెలంగాణలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు వరంగల్ పశ్చిమలోని కాజీపేట కూడలిలో వీధి సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 3.30 గంటలకు కరీంనగర్‌ సర్కస్‌ గ్రౌండ్‌లో ప్రచార సభలో పాల్గొంటారు. అలాగే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధిరామయ్య ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు మక్తల్‌లో ఎన్నికల ర్యాలీలో పాల్గొని ప్రసంగించనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు ముషీరాబాద్‌లో జరిగే ప్రచార సభలో ఆయన మాట్లాడనున్నారు.

Read also: Rythu Bandhu Funds: రైతుబంధు కోసం ఎదురుచూపులు.. బ్యాంకులకు సెలవులు ఉండటంతో ఆలస్యం

రాహుల్ గాంధీ శనివారం రాత్రి ఆకస్మికంగా హైదరాబాద్ పర్యటించారు. నగరంలోని ముషీరాబాద్‌, అశోక్‌నగర్‌లో పర్యటించిన రాహుల్‌ ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న విద్యార్థులతో ముచ్చటించారు. నిరుద్యోగులను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమ బాధలను పంచుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పేపర్ లీకేజీలు, నోటిఫికేషన్లు నిలిచిపోయిన ఘటనలపై నిరుద్యోగులు రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లారు. నిరుద్యోగుల పట్ల సీఎం కేసీఆర్ వైఖరిని తీవ్రంగా ఖండించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. అనంతరం చిక్కడపల్లిలోని బావర్చి హోటల్‌లో రాహుల్ నిరుద్యోగులతో కలిసి బిర్యానీ తిన్నారు. అక్కడ కస్టమర్లను కలిశారు. ఈ క్రమంలో పలువురు రాహుల్ గాంధీతో సెల్ఫీలు దిగారు.
Srisailam: శ్రీశైలంకు పోటెత్తిన భక్తులు.. పెద్ద ఎత్తున కార్తిక దీపారాధనలు!

Exit mobile version