Site icon NTV Telugu

Rahul Gandhi: రాష్ట్రానికి మరోసారి రాహుల్ గాంధీ.. నిజామాబాద్‌, సిరిసిల్ల, ఆదిలాబాద్‌ లో ప్రచారం

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఎన్నికలకు 4 రోజులు ఉండటంతో నాయకులు రాష్ట్రానికి క్యూ కట్టారు.ఈనేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ ఇవాళ తెలంగాణకు రానున్నారు. నేడు నిజామాబాద్, ఆదిలాబాద్‌, రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ప్రచారంలో పాల్గొననున్నారు. బోధన్ లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. అంబంగేట్ సమీపంలో గ్రౌండ్ లో విజయ భేరి బహిరంగసభలో రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు. నాందేడ్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఆయన ఉదయం11.30 గంటలకు బోధన్‌లోని సభకు హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు వేములవాడ, రాజన్న సిరిసిల్లా నియోజకవర్గాల్లోని ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో నేడు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ తరపున బహిరంగ సభలో ప్రచారం నిర్వహించనున్నారు. అక్కడి నుంచి ఆదిలాబాద్ మధ్యాహ్నం 3.30 కి ఇందిరా ప్రియదర్శిని స్టేడియం లో జరిగే ఎన్నికల ప్రచార బహిరంగ సభలో రాహుల్ పాల్గొననున్నారు. రాహుల్‌ సభకు కాంగ్రెస్ నాయకులు ఏర్పాట్లు పూర్తి చేసారు. అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బేగంపేటకు చేరుకుంటారు. అక్కడ కాసేపు రాష్ట్రంలోని కీలక నేతలతో ఎన్నికల పరిస్థితులపై చర్చిస్తారు. ప్రముఖుల పర్యటన సందర్భంగా పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.
NLC Recruitment 2023 : ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ లో 295 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్..

Exit mobile version