NLC Recruitment 2023 : ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ లో 295 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది.. ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ కడలూరులో గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల భర్తీ చేపట్టనుంది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 295 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. డిగ్రీ, పీజీ డిగ్రీతో పాటు గేట్-2023 స్కోరు సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఆసక్తి, అర్హతలు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు డిసెంబరు 21 చివరి గడువుతేదిగా నిర్ణయించారు.. పూర్తి వివరాలు..
మొత్తం ఖాళీలు: 295
Also Read
- మార్కులు, డిగ్రీలకు మించి: ‘హ్యూమన్ స్కిల్ పాస్‌పోర్ట్’ను పరిచయం చేస్తున్న HIPSA & Power Sportz
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్‌టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైయినీ పోస్టులు
రీన్యూయబల్ ఎనర్జి(ఏరియా-1): 140 ఖాళీలు
మెకానికల్: 36
సివిల్: 15
కంప్యూటర్: 18
ఎలక్ట్రికల్: 71
మైన్స్ & అల్లైడ్ సర్వీసెస్(ఏరియా-2): 155 ఖాళీలు
సివిల్: 13
మైనింగ్: 17
మెకానికల్: 84
ఎలక్ట్రికల్: 38
కంప్యూటర్: 03
అర్హతలు..
సివిల్ ; జనరల్,ఈడబ్ల్యూఎస్,ఓబీసీ అభ్యర్థులు కనీసం 60శాతం మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 50 శాతంమార్కులతో సివిల్ ఇంజినీరింగ్/సివిల్ & స్ట్రక్చరల్ ఇంజినీరింగ్‌లో ఫుల్ టైమ్/ పార్ట్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీతో పాటు గేట్-2023 స్కోరు కలిగి ఉండాలి.
అదే విధంగా ఎలక్ట్రికల్ ; జనరల్,ఈడబ్ల్యూఎస్,ఓబీసీ అభ్యర్థులు కనీసం 60శాతం మార్కులు కలిగి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 50 శాతంమార్కులతో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్/పవర్ ఇంజినీరింగ్‌లో ఫుల్ టైమ్/ పార్ట్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీతో పాటు గేట్-2023 స్కోరు సాధించి ఉండాలి..
మెకానికల్ ; జనరల్,ఈడబ్ల్యూఎస్,ఓబీసీ అభ్యర్ధులు కనీసం 60శాతం ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 50 శాతంమార్కులతో మెకానికల్ ఇంజినీరింగ్/మెకానికల్ & ప్రొడక్షన్ ఇంజినీరింగ్‌లో ఫుల్ టైమ్/ పార్ట్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీతో పాటు గేట్-2023 స్కోరు సాధించాలి..
కంప్యూటర్ ; జనరల్,ఈడబ్ల్యూఎస్,ఓబీసీ అభ్యర్థులు కనీసం 60శాతం ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 50 శాతంమార్కులతో ఫుల్ టైమ్/ పార్ట్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీ(కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్/కంప్యూటర్ ఇంజనీరింగ్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) లేదంటే కంప్యూటర్ అప్లికేషన్స్‌లో పీజీ డిగ్రీతో పాటు గేట్-2023 స్కోరు కలిగి ఉండాలి..
మైనింగ్ ; జనరల్,ఈడబ్ల్యూఎస్,ఓబీసీ అభ్యర్థులు కనీసం 60శాతం ఉత్తీర్ణత ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 50 శాతంమార్కులతో మైనింగ్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ తో గేట్ లో స్కోరే పరిగణలోకి తీసుకుంటారు..
వయోపరిమితి..
జనరల్,ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 30 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులు 33 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 35 సంవత్సరాలు మించరాదు..
అప్లికేషన్ ఫీజు..
జనరల్,ఈడబ్ల్యూఎస్, ఓబీసీ దరఖాస్తు ఫీజు రూ.500 దీంతోపాటు ప్రాసెసింగ్ ఫీజు రూ.354 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ప్రాసెసింగ్ ఫీజు రూ.354 తగ్గింపు ఉంటుంది..
జీతం..
నెలకు రూ.50,000-రూ.1,60,000 చెల్లిస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 21.12.2023..
ఇంటర్వ్యూ ప్రక్రియ..
గేట్ స్కోర్, ఇంటర్వ్యూ ప్రక్రియ ద్వారా అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు..
ఈ ఉద్యోగాలకు సంబందించిన మరింత సమాచారం కోసం పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.nlcindia.in/ పరిశీలించగలరు..
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..