Site icon NTV Telugu

Rahul Gandhi: కేటీఆర్ ఇలాకాలో రాహుల్ టూర్.. ప్లానేంటి?

Rahulgandhi

Rahulgandhi

మ‌రోమారు రాష్ట్రానికి రాహుల్ గాంధీ రానున్నారు. కేటీఆర్ ఇలాకా టార్గెట్ గా ఎంచుకున్నారు రాహుల్‌. కాగా.. సెప్టెంబర్ లో మరోసారి రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ రానున్నారు. అయితే.. మంత్రి కేటీఆర్ నియోజకర్గమైన సిరిసిల్లకు సెప్టెంబర్ 17న ఆయన రానున్నారు. కాగా.. అక్కడి నుంచే విద్యార్థి యువజన డిక్లరేషన్‌ను విడుదల చేయనున్నారు.

ఇది ఇలావుండ‌గా.. మరోవైపు టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టాక ఇటీవలి కాలంలో కాంగ్రెస్ పార్టీ లోకి చేరికలు పుంజుకుంటున్నాయి. అంతేకాదు.. ఇక ముందు కూడా తెలంగాణ కాంగ్రెస్ లో భారీ చేరికలకు రంగం సిద్ధమైంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోకి వివిధ పార్టీల నుంచి చేరేందుకు పలువురు ముఖ్య నేతలు సముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈనేప‌థ్యంలో.. భారీ జాబితాకు నాయకత్వం రూపు కల్పన చేసింది. దీంతో.. జాబితాలో వివిధ పార్టీలకు చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సహా పలువురు కీలక నేతలు ఉన్నారు. అయితే.. విడతల వారీగా చేరికలు ఉండేలా నాయకత్వం వ్యూహరచన చేస్తోంది. ఈనేప‌థ్యంలోనే సెప్టెంబర్ 17న తెలంగాణకు రాహుల్ రానున్నారు. అయితే రాహుల్ సమక్షంలో పెద్ద ఎత్తున చేరికలుంటాయని సమాచారం. ఇదంతా సరే కానీ.. కేటీఆర్ ఇలాకా సిరిసిల్లనే ఎందుకు ఎంచుకున్నారనేదే ప్రతి ఒక్కరికి ప్రశ్నాగా మారింది.

Coffee With Karan: మాజీ లవర్‌పై సారా, జాన్వీ సెటైర్

Exit mobile version