Site icon NTV Telugu

వంద మంది సీఎంలు వచ్చినా ఈటల గెలుపు ఖాయం : రఘునందన్ రావు

హుజురాబాద్ ఎన్నికల్లో అధికార టిఆర్ఎస్ పార్టీ కుట్రలు, కుతంత్రాలకు తెర లేపుతోందని.. ఎమ్మెల్యేలు, మంత్రులు, వంద మంది సీఎంలు వచ్చినా ఈటల గెలుపును ఆపలేరని స్పష్టం చేశారు రఘునందన్ రావు. 14 ఏళ్ల ఉద్యమ పార్టీ.. ఏడేళ్ల అధికార పార్టీ.. ఒక్క బీసీ నాయకుని తయారు చేసుకోలేక పోయిందని చురకలు అంటించారు. గతంలో దుబ్బాకలో లక్ష మెజారిటీతో గెలిచినట్టు… హుజురాబాద్ మాదే అని ప్రకటనలిస్తున్నారన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఎన్ని నోట్ల కట్టలు వెదజల్లినా ఎవరికి పట్టం కట్టాలో ప్రజలు ఒక్క సారి ఆలోచించుకోవాలని సూచించారు.

read also : సీమకే కాదు ఉమ్మడి ఏపీకి అన్యాయం చేసింది చంద్రబాబే !

గతంలో దుబ్బాకలో ఎంత నిష్టగా బీజేపీ పని చేసిందో… అదే నియమనిష్టలతో హుజురాబాద్ లో కూడా పని చేస్తామన్నారు. పాలపొంగు, నీటి బుడగ లాగా ఫ్లెక్సీలు పెట్టుకుని వెళ్ళగానే గెలుపు రాదని పేర్కొన్నారు. టిఆర్ఎస్, కాంగ్రెస్ మాటలు అన్ని ఉత్తవేనని… హుజురాబాద్ లో బీజేపీ, టిఆర్ఎస్ ల మధ్యే పోటీ ఉంటుందన్నారు.

Exit mobile version