NTV Telugu Site icon

Raghunandan Rao: బీఆర్ఎస్ పార్టీ అకౌంట్ నుంచి 30 కోట్లు ట్రాన్స్ ఫర్ అయ్యాయి..

Raghunandan Rao

Raghunandan Rao

Raghunandan Rao: మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బంజారాహిల్స్ బరోడా బ్యాంక్ లోని BRS పార్టీ అకౌంట్ నుంచి 30 కోట్ల రూపాయలు ట్రాన్స్ ఫర్ అయ్యాయని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఈ డబ్బులను ఖర్చు చేసేందుకు BRS ప్రయత్నిస్తుందన్నారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలో ఉన్న BRS పార్టీ ఎమ్మెల్యేలకుజ్ మాజిలకు అకౌంట్ లో కోటి రూపాయలు వేశారన్నారు. BRS పార్టీ ప్రతి ఎన్నికల్లో డబ్బులు పెట్టి గెలవాలని చూస్తుందన్నారు. ఎంపీ ఎన్నికల్లో మెదక్ లో ఒక్కొక్క ఓటర్ కి 500 రూపాయలు పంచారని ఆరోపించారు. డబ్బులు పంచి గెలవాలి అనుకుంటున్న BRS పార్టీ గుర్తింపు రద్దు చెయ్యాలన్నారు.

Read also: IT Rides : జ్యువెలర్స్‌పై ఐటీ దాడులు.. భారీగా లెక్కల్లో చూపని సొత్తు..

నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక తుది లెక్కింపుకు చేరుకుంది. ప్రచార గడువు ముగియడంతో అందరి దృష్టి పోలింగ్ పైనే పడింది. రేపు ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. ఎన్నికల అధికారులు పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. అదే సమయంలో ప్రలోభాల పండుగకు తెరతీసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో గెలుపే ధ్యేయంగా పలు పార్టీలు పట్టభద్రుల ఓట్లను కొనేందుకు యత్నిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Revanth reddy – Balakrishna : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన నందమూరి బాలకృష్ణ..