NTV Telugu Site icon

Raghunandan Rao: నిన్నటి వరకు దొంగల్లా కనిపించిన ఆంధ్రోళ్లు ఇవాళ ఆప్తులా?

Raghunandanrao

Raghunandanrao

Raghunandan Rao: నిన్నటి దాకా దొంగల్లా కనిపించిన ఆంధ్రోళ్లు ఇవాళ ఆప్తులుగా కనిపిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఎద్దేవ చేశారు. మియాపూర్ లాండ్ లో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపించారు. సీఎం ముగ్గురు సబ్ రిజిస్ట్రార్ ల పై చర్యలు తీసుకున్నారని తెలిపారు. సీఎం బిహారీ… ఇది ఆంధ్రోళ్లు చెప్పారు. ఆయనకు బీహార్ కు చెందిన సోమేశ్ మీద ప్రేమ ఎక్కువ అని ఎద్దేవ చేశారు. BRS అంటే బీహార్ రాష్ట్ర సమితి అంటూ వ్యాఖ్యానించారు. రేపటి సభకు డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయని ప్రశ్నించారు. మియాపూర్ భూములు మీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడికి ఎలా కట్ట బెడుతున్నారు? అని ప్రశ్నించారు. ఈవిషయమై రేపు సభలో చెబితే బాగుంటుందని తెలిపారు. హాఫిజ్ పేట్ లోని 78 సర్వే నంబర్ భూములను తనఖా పెట్టీ ఎంబీఎస్ జువెలర్స్ సుఖేశ్ గుప్తా లోన్ తీసుకున్నారన్నారు. ఆ భూమిని అమ్ముకోవచ్చని కోర్ట్ తీర్పు ఇచ్చిందని స్పష్టం చేశారు.

Read also: Sridevi First Husband: శ్రీదేవి మొదటి భర్త? అప్పట్లో సంచలనం

దీనికి వ్యతిరేకంగా ఈ7 ఎకరాల కోసం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సుప్రీం కోర్టులో slp వేశారని గుర్తుచేశారు. ఇక్కడ కనిపించని మరో కోణం తోట చంద్రశేఖర్ కోణం అంటూ వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తు్న్నాయి. ఇదే సర్వే నంబర్ లో 40 ఎకరాల భూమి ఆదిత్య కంపెనీ మీద తోట చంద్రశేఖర్ కొనుగోలు చేశారని అన్నారు. ఈ అంశంపై సుప్రీం కోర్టులో అప్పీల్ కు కలెక్టర్ ఎందుకు వెళ్ళడం లేదని ప్రశ్నించారు. 4 వేల కోట్ల తెలంగాణ ఆస్తులను ఒక ఆంధ్ర కాంట్రాక్టర్ కు కట్ట బెడుతున్నారని ఆరోపించారు. తోట చంద్రశేఖర్ చేత BRS సభకు ఖర్చు పెట్టుస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. క్విడ్ ప్రో కో జరుగుతుందని అన్నారు. సుప్రీం కోర్టుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని తెలిపారు. ప్రమోటి ఐఏఎస్ లను హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల కు కలెక్టర్ లుగా నియమించారని అన్నారు. భూ దందా కోసమే వారిని నియమించారని ఆరోపణలు గుప్పించారు రఘునందన్‌ రావు.