NTV Telugu Site icon

నేడు పీవీ జ‌యంతి…ఘ‌నంగా జయంతోత్స‌వాలు…

దేశంలో సంస్క‌రణ‌లు తీసుకొన్ని, అభివృద్దిబాటలో న‌డిపించిన ప్ర‌ధానీ పీవీ న‌ర‌సింహారావు.  అప్ప‌టి ప్ర‌ధాని రాజీవ్ గాంధి మ‌ర‌ణం త‌రువాత‌, కాంగ్రెస్ పార్టీలో, దేశంలో నెల‌కొన్న అనిశ్చితి తొల‌గించేందుకు స‌మ‌ర్ధుడైన వ్య‌క్తిని ప్ర‌ధానిగా నియ‌మించాల‌ని అప్ప‌టి కాంగ్రెస్ పార్టీ పేర్కొన్న‌ది.  పీవీ ప్ర‌ధాని అయ్యాక, అనేక సంస్క‌ర‌ణ‌లు తీసుకురావ‌డంతో దేశం అన్ని రంగాల్లో అభివృద్ది దిశ‌గా అడుగులు వేసింది. పీవీ న‌ర‌సింహారావు తెలుగు వారు కావ‌డం, అందులోనూ తెలంగాణకు చెందిన వ్య‌క్తి కావ‌డంతో రాష్ట్రంలో గ‌త ఏడాది కాలంగా పీవీ జ‌యంతోత్స‌వాల‌ను రాష్ట్ర‌ప్ర‌భుత్వం అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించారు.

Read: “కనబడుటలేదు”… కానీ ట్రెండింగ్ లో కన్పిస్తోంది…!!

ఈరోజు పీవీ న‌ర‌సింహారావు జయంతి కావ‌డంతో ఈరోజుతో ఉత్స‌వాల ముగింపు వేడుక‌ల‌ను రాష్ట్ర‌ప్ర‌భుత్వం అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించ‌బోతున్న‌ది.  హైద‌రాబాద్‌లోని న‌క్లెస్ రోడ్‌లో పీవీ న‌ర‌సింహారావు విగ్ర‌హాన్ని ఏర్పాటు చేశారు.  ఈ విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ ఈరోజు ఉద‌యం 11 గంట‌లకు జ‌ర‌గ‌బోతున్న‌ది.  ఈ విగ్ర‌హావిష్క‌ర‌ణ మ‌హోత్స‌వానికి రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ తిమిళిసై, ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, వివిధ శాఖ‌ల‌కు చెందిన మంత్రులు, అధికారులు హాజ‌రుకాబోతున్నారు.