Puvvada Ajay Kumar: పక్క రాష్ట్రాల్లో కూడా ఆర్టీసి పరిస్థితులు బాగాలేవరి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ప్రజా రవాణాలో టీఎస్ ఆర్టీసీ ప్రధాన పాత్ర పోషిస్తుందని అన్నారు. కరోనా దెబ్బకు బస్సులు డిపోలకే పరిమితమై.. రోజుకి కోటి రూపాయలు కూడా రాలేదని గుర్తు చేసుకున్నారు. పక్క రాష్ట్రాల్లో కూడా ఆర్టీసి పరిస్థితులు బాగాలేవని అన్నారు. కానీ మన రాష్ట్రంలో ఆర్టీసిలో తీసుకుంటున్న చర్యల వల్ల కొంత ఆర్టీసి పరిస్తితి మెరుగు పడుతుందని అన్నారు. ఆర్టీసీ ప్రస్తుతం 560 కోట్ల నష్టంలో ఉందని తెలిపారు.
Read also: Viral Video: బాయ్ ఫ్రెండ్ ఉంటే మాత్రం దారుణంగా కొట్టేస్తారా?
నష్టాలు తగ్గించటానికి మరింత బలంగా పనిచేయాలని తెలిపారు. 760 కొత్త బస్సులు అందుబాటులోకి వచ్చాయని వెల్లడించారు. నాన్ ఏసి, ఎలక్ట్రిక్ బస్సులు హైదరాబాద్ లో నడపటానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు. పాత బస్టాండ్ లను మరమత్తులు చేసి సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు. ప్రయాణికుల సౌకర్యం కోసం బస్టాండ్ లను ఆధునీకరిస్తున్నామని అన్నారు. ఆర్టీసి కనెక్టివిటీ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. మెట్రో, రైల్వే, ఎయిర్ పోర్ట్ కు చేరువయ్యేలా ఆర్టీసి బస్సుల కనెక్టివిటీ చేపడుతున్నామని మంత్రి తెలిపారు.
America: విమానం ఇంజన్ మూలంగా వ్యక్తి మృతి