ఏపీ ప్రభుత్వంపై మంత్రి పువ్వాడ అజయ్ ఫైర్ అయ్యారు. తెలంగాణకు దక్కాల్సిన వాటా విషయంలో రాజీ పడేదే లేదని.. ఎన్జీటీ తీర్పులను ఏపీ గౌరవించడం లేదని ఫైర్ అయ్యారు. వెంటనే కేంద్రం ఇరు రాష్ట్రాల వాటా తేల్చాలని.. తెలంగాణకు అన్యాయం చేయాలని చూస్తే.. ఊరుకునేది లేదని హెచ్చరించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమంగా నీళ్ల తరలింపు పరాకాష్టకు చేరిందని.. కేంద్రానికి అబద్ధాలు చెప్తూ అక్రమంగా ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం నిర్మిస్తోందని ఫైర్ అయ్యారు.
read also :తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపికలో కొత్త లడాయి!
బీజేపీ ఏపీలో ఒకలా మాట్లాడితే తెలంగాణలో మరోలా మాట్లాడుతుందని.. తెలంగాణ పట్ల తండ్రికి మించిన తనయుడు జగన్మోహన్ రెడ్డి అని మండిపడ్డారు. ఆనాడే వైఎస్సార్ తెలంగాణలో ఒకలా… ఏపీలో మరోలా మాట్లాడి తెలంగాణ సమాజాన్ని చిన్నచూపు చూసారని విమర్శలు చేశారు. కేంద్రంలో అధికార బీజేపీ సన్నాయి నొక్కులు నొక్కుతోందన్నారు. వైఎస్సార్ విషయంలో వేముల ప్రశాంత్ రెడ్డి మాటలు వందశాతం నిజమని.. తెలంగాణ ప్రజల హక్కుల కోసం మేము మాట్లాడుతున్నామని… మా హీరోయిజం కోసం కాదని పేర్కొన్నారు.
