నియోజకవర్గ చరిత్రలో ప్రజా వేదిక చారిత్రకంగా వుంటుందన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొంతమంది సన్నాసులు ఏవేవో మాట్లాడుతున్నారని, కొంత మంది అవాకులు చవాకులు పేలుతున్నారని ధ్వజమెత్తారు. ఆ సన్నాసులంతా మొదట ప్రజాసేవ చేయాలని సూచించారు.ప్రజల గుండెల్లో పువ్వాడ వున్నారని, పువ్వాడ అనే పేరు ప్రజల గుండెల్లో వున్న పేరు అని, ప్రజా సేవలో పునరంకితం అయిన పేరు అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Team India Practice: టీమిండియా కఠోర సాధన.. బాల్తో కాకుండా దానితో ప్రాక్టీస్
ఎన్ని రోజులు పదవుల్లో వున్నమనేది కాదని, పదవుల్లో వున్నప్పుడు సేవలు చేశామా లేదా అన్నది కాదని, ఎన్నికలు వచ్చాయని నేను చెప్పడం లేదన్నారు. నన్ను ఆదరించిన వారికి సేవలు చేయడం కోసమే నేను కృషి చేస్తున్నానన్నారు పువ్వాడ. కాగా, అంతకుముందు పొంగులేటి మాట్లాడుతూ.. ఆయనో బచ్చా అని విమర్శించారు. తనతో పోటీ చేసే అర్హత ఆ మంత్రికి లేదన్నారు. ఖమ్మం జిల్లాలో ఏ ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేను గెలవనీయనని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై పువ్వాడ తీవ్రంగా స్పందించారు.
Also Read : Video Viral: కళ్లకు గంతలు కట్టుకున్న భలే కొట్టాడే.. వీడియో వైరల్..!