NTV Telugu Site icon

Telangana: తల్లిదండ్రులకు గమనిక.. రేపే పల్స్ పోలియో

కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా ఈనెల 27న ఆదివారం పల్స్‌ పోలియోను అధికారులు నిర్వహించనున్నారు. 0-5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమం నిర్వహించిన అనంతరం రెండు రోజుల పాటు ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా ఆదివారం నాడు హెల్త్, అంగన్వాడీలు, ప్రభుత్వ పాఠశాలలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టులు ఇతర ప్రాంతాలలో పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆదివారం ఉ.8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పోలియో చుక్కలు వేస్తారన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి హరీష్ రావు సూచించారు. కాగా ఆదివారం దాదాపు 38 లక్షల చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు.