Site icon NTV Telugu

Pudding and Mink Drugs case: రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు

Drugs Case

Drugs Case

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్‌ కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి.. రిమాండ్‌ రిపోర్ట్‌లో పూర్తి విషయాలను పేర్కొన్నారు బంజారాహిల్స్ పోలీసులు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.40 గంటలకు పబ్‌కు సంబంధించిన సమాచారం వచ్చిందని.. రాడిసన్ బ్లు హోటల్‌లోని పుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌లో తెళ్లవరజామున 4 గంటలకు కోకైన్ సరఫరా చేస్తున్నరేని సమాచారం అందిందని.. ఈజీ మనీ కోసమే నిర్వాహకులు డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నట్టు పేర్కొన్నారు.. విశ్వసనీయ సమాచారం ఆధారంగా ఉన్నత అధికారులకు సమాచారం చేర వేశామని.. 1985 NDPS యాక్ట్ u/s 42(2) కింద కేసు నమోదు చేశామని వెల్లడించారు..

Read Also: Hyderabad Pub Case: నిహారికను సపోర్ట్ చేసిన తమన్నా.. పబ్‌కు వెళ్లడమే తప్పా?

ఇక, క్లూస్‌ టీమ్‌కు సమాచారం అందించిన పోలీసులు.. పబ్‌పై 2 గంటల ప్రాంతంలో దాడి చేసినట్టు తెలిపారు.. దాడి చేసే ముందు తమ వెంట ల్యాప్ టాప్, మినీ ప్రింటర్, వెయింగ్ మెషిన్, ప్యాకింగ్ మెటీరియల్ వెంట తీసుకెళ్లినట్టు పేర్కొన్నారు.. పబ్‌లోకి ఎంటర్ కాగానే మేనేజర్ అనిల్ కుమార్‌ను కలిసి దాడి సమాచారం ఇచ్చామని ఇప్పటికే ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు పోలీసులు.. క్లూస్ టీమ్‌తో కలిసి పబ్‌పై దాడి చేశామని.. పబ్‌లో అనిల్, ప్రవీణ్‌లను మధ్యవర్తులుగా పెట్టుకుని వారి సమక్షంలో దాడులు చేశామన్నారు.. మేనేజర్ అనిల్ కుమార్ వద్ద ప్లాస్టిక్ ట్రేలో కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు.. మొత్తం 5 ప్యాకెట్లలో 4.64 గ్రాములు తెల్ల పౌడర్ స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.. పబ్‌లోనే ఉన్న పాట్నర్ అభిషేక్‌ను అదుపులోకి తీసుకున్నామని.. అతడి మొబైల్ స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.

Exit mobile version