Site icon NTV Telugu

దాడి ఘటనకు పబ్‌కు సంబంధం లేదు: కెమిస్ర్టీ పబ్‌ ఎండీ సంతోష్‌

కెమిస్ర్టీ పబ్‌లో పని చేసే ఓ మహిళ పై లైంగిక దాడి జరిగిందన్న విషయం మాకు తెలియదని పబ్‌ ఎండీ సంతోష్‌ మీడియాకు తెలిపారు. దీనికి సంబంధించిన పలు విషయాలను ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పోలీసులు వచ్చి చెప్పేంతవరకు లైంగిక దాడి ఘటన విషయం మాకు తెలియదని ఆయన అన్నారు. లైంగిక దాడి ఘటనకు పబ్‌కు ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పారు. పబ్‌లో పనిచేసే సిబ్బంది డ్యూటీ ముగించుకుని వెళ్లాక బయట ఏం చేస్తారనేది చూడలేంఅన్నారు.

నెల రోజుల కిందటనే ఈవిషయం తెలిసిన వెంటనే చెఫ్‌ను ఉద్యోగం నుంచి తొలగించామన్నారు. యువతి కూడా మా బావతో పెళ్లి ఉంది అని చెప్పి జాబ్ మానేసి వెళ్ళిపోయిందన్నారు. ఇప్పుడు సడెగా పోలీస్‌ స్టేషన్‌కు ఎందుకు వెళ్లిందో తెలియదన్నారు.పబ్‌లలో పలు వివాదాలు జరగకుండా చూస్తామన్నారు. పబ్‌లకు ఎంజాయ్‌మెంట్‌ కోసం వచ్చినప్పుడు కొన్ని వివాదాలు జరుగుతాయని ఆయన తెలిపారు. మేము లిక్కర్‌ మాత్రమే సరఫరా చేస్తామని చెప్పారు.

Exit mobile version