Malla Reddy: మరోసారి మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ ఎదురైంది. గో బ్యాక్ మల్లారెడ్డి, గో బ్యాక్ అంటూ గ్రామస్థులు పెద్ద ఎత్తున నినాదలు చేశారు. శామీర్ పేట మండలం బొమ్మరాసి పేట గ్రామపంచాయతీ పరిధిలో గ్రామస్తులకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా గ్రామానికి విచ్చేసిన మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతుండగా గ్రామస్థులు అడ్డుకున్నారు. గ్రామంలో 380 మంది అర్హులైన వారందరికీ ఒకేసారి పట్టాలు ఇవ్వాలని కోరారు. ఇప్పుడు కొంతమందికి తర్వాత కొంతమందికి పట్టులు ఇస్తామంటే ఊరుకునే ప్రసక్తి లేదని మల్లారెడ్డిని గ్రామస్తులు నిలదీశారు. మంత్రి మల్లారెడ్డి అర్హులైన వారికి కాకుండా కొంతమందికే పట్టాలు ఇస్తానని మాట్లాడడంతో.. గో బ్యాక్ మంత్రి మల్లారెడ్డి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈనేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఎంట్రీ ఇచ్చారు. 2009వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో బొమ్మరాసిపెట గ్రామస్తులకు 200 మందికి పట్టాలు ఇచ్చామని అన్నారు. అవే పట్టాలను మంత్రి మల్లారెడ్డి అర్హులైన పేదలకు కాకుండా వేరే వాళ్లకు పట్టాలను పంపిణీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: Rashmika Mandanna: విజయ్ దేవరకొండ ఇంట్లో మరోసారి అడ్డంగా బుక్కైన రష్మిక?
మంత్రి మల్లారెడ్డి డబల్ బెడ్ రూమ్, గృహలక్ష్మి ,పేర్లతో దళిత బంధు పేర్లతో ప్రజలను మరోసారి మోసం చేస్తున్నాడని టిపిసిసి అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హరివర్ధన్ రెడ్డి పట్టాల విషయమై మంత్రిని అడగడానికి వెళ్తుంటే శామీర్ పేట పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారని మండిపడ్డారు. హరివర్ధన్ రెడ్డిని అరెస్టు చేసి తీసుకెళ్తుండగా కాంగ్రెస్ పార్టీ నేతలు పోలీస్ వాహనం ముందు బైఠాయించి మల్లారెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. చివరికి 380 మందికి అర్హులైన వారందరికీ ఒకేసారి వచ్చే మంగళవారం పట్టాలు ఇస్తామని మంత్రి మల్లారెడ్డిరెడ్డి హామీ ఇవ్వడంతో ప్రజలు శాంతించారు. ఎవరి మాట నమ్మవద్దని సీఎం కేసీఆర్ అందరికి న్యాయం చేస్తారని తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు పేదలకు తప్పకుండా అందజేస్తామని హామీ ఇచ్చారు. దయచేసి ఎవరూ భావోద్వేగాలకు పోకుండా ఉండాలని కోరారు.
Health Tips: లవంగాలలో తేనె కలిపి తీసుకుంటే..ఏం జరుగుతుందో తెలుసా?