Site icon NTV Telugu

ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో సాంకేతికలోపం.. కరోనా కారణంగా ఉత్పత్తి నిలిపివేత


పెద్దపల్లి జిల్లాలో ఉన్న రామగుండం ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో (రామగుండం ఫర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్‌ లిమిటెడ్‌) సాంకేతిక కారణాలుతో పాటు పలువురు సిబ్బందికి కరోనా సోకడంతో ఫ్యాక్టరీలో ఉత్పత్తిని యాజమాన్యం నిలిపి వేసింది. ఆర్ఎఫ్‌సీఎల్‌లోని ప్రిల్లింగ్‌టవర్‌లో ఏర్పడ్డ సాంకేతిక అంశాలతోపాటు పలువురు శాశ్వత ఏర్పడ్డ ,ఒప్పంద ఉద్యోగులుకు కరోనా రావడంతో కర్మాగారంలో ఉత్పత్తి పనులను నిలిపివేసినట్టు యాజమాన్యం ప్రకటించింది.

Read Also: తెలంగాణలో పలు జిల్లాలకు అదనపు కలెక్టర్ల కేటాయింపు

సుమారు 120 మంది ఒప్పంద కార్మికులతో పాటు పలువురు శాశ్వత ఉద్యోగులు కరోనా బారిన పడటం యాజమాన్యాన్ని కలవరపెడుతుంది. వారికి ఏడురోజుల వేతనంతో కూడిన సెలవు ఇవ్వనున్నట్లు ఆర్‌ఎఫ్‌సీఎల్‌ యాజమాన్యం ప్రకటించింది. ప్రతిరోజూ 3,850 టన్నుల యూరియాతో పాటు అమ్మోనియా ఉత్పత్తి ఉద్దేశంతో గతేడాది ఫిబ్రవరిలో ఈ ఫ్యాక్టరీని పున: ప్రారంభించారు. తాజాగా సాంకేతిక అవరోధాల కారణంగానే ఉత్పత్తి ఆపివేసినట్టు యాజమాన్యం చెబుతున్నప్పటికీ అసలు కారణం కరోనా కారణమని తెలుస్తుంది.

Exit mobile version