NTV Telugu Site icon

Sangareddy Crime: ఫుట్ పాత్ పైకి దూసుకొని వచ్చిన బస్సు.. సీసీ ఫుటేజ్ దృశ్యాలు

Sangareddy Crime

Sangareddy Crime

Sangareddy Crime: సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అతివేగంగా నడుపుతూ అర్ధరాత్రి ఫుట్ పాత్ పైకి నుంచి డాబావైపు ప్రైవేటు బస్సు దూసుకొని వచ్చింది. అయితే అక్కడ వున్న వ్యక్తిపైకి దూసుకురావడంతో.. ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సు దూసుకుని రావడంతో డాబాలో వున్న కస్టమర్లు పరుగులుతీసారు. ఎదురుగా వుస్తున్న బస్సును డాబా వద్ద నిలబడి వున్న వ్యక్తి గమనించడంతో ప్రమాదం తప్పింది. బస్సులు దూసుకుని ఫుట్ పాత్ వైపు ఉంచి డాబావైపు దూసుకువస్తుండటంతో ఒక వ్యక్తి మిగతావారికి అక్కడి నుంచి పక్కకు రావాలని కేకలు వేయడంతో అందరూ పరుగులు పెట్టి ప్రాణాలు కాపాడుకున్నారు. అయితే ఈ ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. డాబా యాజమాన్యం పోలీసులుకు సమాచారం అందించారు.

Read also: Tirupati: తిరుపతిలో రెచ్చిపోతున్న ప్రైవేట్ ట్రావెల్స్..

దీంతో హుటా హుటిన ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతి చెందిన వ్యక్తి రామచంద్రాపురం నివాసిగా గుర్తించారు. అతను బీడీఎల్ ఎంప్లాయ్ గా పనిచేస్తున్న యాదయ్యగా గుర్తించిన పోలీసులు. పోస్టుమార్టం నిమిత్తం పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రికి యాదయ్య మృతదేహాన్ని తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రైవర్ అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. డ్రైవర్ నిద్ర మత్తులో ఉన్నాడా? లేదా మద్యం తాగి వాహనం నడుపుతున్నాడా? అనేది తెలియాల్సి ఉంది. సీసీ కెమెరాలు రికార్డ్ అయిన దృశ్యాలను పరిశీలిస్తున్నారు.
Ice Apple : వేసవిలో తాటి ముంజలను తింటున్నారా? ఎన్ని ప్రయోజనాలో తెలుసా?