PM MODi: నేడు హైదరాబాద్ కు మోడీ.. మాదిగ విశ్వరూప సభలో ప్రధాని ప్రసంగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. బీజేపీ కూడా తమ అగ్రనేతలను ఆహ్వానిస్తూ ప్రచార హోరును పెంచింది. అయితే, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇవాళ మరోసారి రాష్ట్రానికి రానున్నారు. పరేడ్ గ్రౌండ్ లో జరిగే మాదిగ విశ్వరూప బహిరంగ సభ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. ప్రధాని మోడీ సాయంత్రం 4.45 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గంలో పరేడ్ గ్రౌండ్‌కు బయలుదేరుతారు. ప్రధాని ప్రసంగం 5:00 నుండి 5:45 వరకు ఉంటుంది. తిరిగి సాయంత్రం 5.55 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. సాయంత్రం అనంతరం 6 గంటలకు బేగంపేట నుంచి తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇక, మాదిగ ఉప కులాల (మాదిగ విశ్వరూప బహిరంగ సభ) బహిరంగ సభలో ఎస్సీ కులాల వర్గీకరణపై మోడీ కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు బీజేపీలోని పలు వర్గాలు తెలిపాయి.
ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని రాక నేపథ్యంలో పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ ప్రధాని పర్యటన నేపథ్యంలో నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అయితే, పరేడ్ గ్రౌండ్స్‌లో నేడు నిర్వహించనున్న మాదిగ-ఉపకులాల విశ్వరూప సభ’కు దూరంగా ఉండాలని బీజేపీ ఎస్సీ మోర్చా చూస్తుంది. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అధ్యక్షతన ఈ సభ జరుగనున్నది. ఇక, తమను కీలక నిర్ణయాల్లో ఇన్వాల్వ్ చేయకపోవడంతో బీజేపీ దళిత నేతలు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. అయితే సభకు దూరంగా ఉంటే ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ ఉందని పలువురు దళిత నేతలు భావిస్తున్నారు. అలా కాదని సభలో పాల్గొంటే మాల సామాజిక వర్గం నుంచి తీవ్ర ఒత్తిడి వస్తుందని బీజేపీ ఎస్సీ మోర్చా నేతలు చెబుతున్నారు.
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
తాజావార్తలు
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
-
Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
-
Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
-
Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!