మానసిక ప్రశాంతత కోసం గుడికెళతారు భక్తులు. పూజారులు పూజలు చేసి భక్తులకు ప్రసాదం అందిస్తారు. కానీ పూజారులే భక్తులపై దాడి చేసిన ఘటన సికింద్రాబాద్ లో కలకలం రేపుతోంది. సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ పూజారులు భక్తుడిపై దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ వైరల్ అవుతోంది.
ఆలయాల్లో భక్తులకు భద్రత లేకపోతే ఎలా అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. భక్తుల పూజారులు దాడి చేసినా అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. దేవునికి పూజలు చేయాల్సిన పూజారులే రౌడీల లాగా దౌర్జన్యం చేస్తే భక్తులకు భద్రత ఎక్కడ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఉప్పల్ బాలాజీహిల్స్ కి చెందిన వాల్మీకీరావు రాత్రి 7 గంటల సమయంలో దర్శనం చేసుకుందాం అని సికింద్రాబాద్ రైతిపైల్ బస్టాండ్ కి అనుకుని ఉన్న గణేష్ టెంపుల్ కి వెళ్లి దర్శనం చేసుకున్నారు.
తర్వాత పక్కనే వున్న చిన్న చిన్న గుడిలో దేవుళ్ళని దర్శనం చేసుకునే క్రమంలో ఒక గుడి లోపలికి వెళ్లి దర్శనం చేసుకుంటున్న సందర్భంలో పర్మిషన్ లేకుండా గుడి లోపటికి ఎందుకు వెళ్ళావ్ అని బూతుల పురాణం మొదలుపెట్టారు పూజారి ప్రభాకర్ శర్మ. ఇద్దరి మధ్యన చిన్న వాగ్వాదం జరిగింది. అక్కడితో ఆగకుండా గుడి పూజారి అయిన ప్రభాకర్ శర్మ ఆ భక్తునిపై దాడి చేసి నువ్వు ఎవరికీ చెప్పుకుంటావో చెప్పుకో అని బెదిరించాడు. గత ఆదివారం ఈ సంఘటన చోటుచేసుకోగా తాజాగా అది వెలుగులోకి వచ్చింది. పూజలు చేసి,భక్తులను ఆశీర్వదించాల్సిన పూజారే ఒక రౌడీ లాగా రెచ్చిపోయి భక్తుని పై దాడి చేయడంపై భక్తులు మండిపడుతున్నారు. గుడిలో భక్తుడిపై పూజారి దాడి చేయడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేసారు. బాధితుడు గత సోమవారం రోజు రాంగోపాల్ పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేశారు. పోలీసులు పూజారి ప్రభాకర్ ని కస్టడిలోకి తీసుకోని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
