Site icon NTV Telugu

Droupati Murmu: చదువుతో పాటు సంస్కృతి, సంస్కారం అలవర్చుకోవాలి

Murmu Narayanamma College

Murmu Narayanamma College

Droupati Murmu: రాష్ట్రపతి ఇవాల ఉదయం షేక్‌పేటలోని జి.నారాయణమ్మ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మహిళా కళాశాల సందర్శించారు. విద్యార్థులు, ఫ్యాకల్టీతో సమావేశమయ్యారు. నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తోపాటు గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం రాష్ట్రపతి మాట్లాడుతూ.. నారాయణమ్మ కాలేజీలో మీ అందరితో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. టెక్నాలజీ అనేది అన్ని రంగాల్లో కీలకమైందని తెలిపారు. ప్రపంచాన్ని బెటర్ ప్లేస్ గా మార్చే శక్తి మనకుందని అన్నారు. మీరు చేసే ఇన్నోవేటీవ్స్ ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని రాష్ట్ర పతి కోరారు. చాలా మంది మహిళలు పెద్ద కంపెనీలను నడిపిస్తున్నారని అన్నారు. టెలికం, ఐటీ, డిజైన్, ఏవియేషన్ వంటి రంగాల్లో మహిళలు ప్రతిభ చూపుతున్నారని తెలిపారు. కంట్రీని స్ట్రాంగ్ ఎకనామిగా మార్చడంలో మీరంతా కీలకం కావాలని అన్నారు. చదువుతో పాటు సంస్కృతి.. సంస్కారాలను అలవర్చుకోవాలన్నారు. దేశంలో స్త్రీ.. పురుష్ అనే రెండు వర్గాలు మాత్రమే ఉన్నాయన్నారు. సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ మన అందరి లక్ష్యమన్నారు.

Read also: Shamshabad Airport: ఎలా వస్తాయిరా ఈ ఐడియాలు.. టీ షర్ట్ లో బంగారం

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ సాయంత్రం 5.00-6.00 శంషాబాద్‌లోని శ్రీరామ్‌నగర్‌లో సమైక్యతామూర్తి శ్రీ రామానుజాచార్య విగ్రహ సందర్శించనున్నారు. రాష్టప్రతి పర్యాటన నేపథ్యంలో శంషాబాద్ లో పూర్తి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. ఇక రేపు (డిసెంబర్ 30)న ఉదయం 10.00-11.00 రంగారెడ్డి జిల్లాలోని కన్హా శాంతి వనంలో శ్రీ రామచంద్ర మిషన్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన అంగన్వాడీ, ఆశా వర్కర్లను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం సాంస్కృతిక మంత్రిత్వశాఖ, శ్రీ రామ చంద్ర మిషన్ కలిసి చేపడుతున్న ‘హర్ దిల్ ధ్యాన్, హర్ దిన్ ధ్యాన్’ ప్రచార కార్యక్రమం ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 1.00గంటకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి విందు ఇవ్వనున్నారు.
vomit: మనం వాంతులు చేసుకున్నప్పుడు.. మెదడులో ఏం జరుగుతుందో తెలుసా.?

Exit mobile version