Droupadi Murmu: తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. ఉదయం 10.40కి శంషాబాద్ ఎయిర్‌పోర్టు చేరుకోనున్నారు. శంషాబాద్‌నుంచి హెలికాప్టర్లో నేరుగా శ్రీశైలం వెళ్లనున్నారు రాష్ట్రపతి ముర్ము. ఉదయం 11.45కు సుండిపెంట హెలిప్యాడ్ చేరుకోనున్నారు. రోడ్డు మార్గం ద్వారా 12.05కు శ్రీశైలానికి చేరుకోనున్నారు రాష్ట్రపతి. మధ్యాహ్నం 2.45 నిమిల వరకు ఆలయ దర్శనం అనంతరం వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు సుండపెంట నుంచి బయలుదేరనున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ముర్ము బస చేయనున్నారు. సాయంత్రం 4.15కు హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ చేరుకోనున్నారు. రాష్ట్రపతి తొలిసారి తెలంగాణకు రానున్న సందర్బంగా.. రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ ఘనంగా స్వాగతం పలకనున్నారు. ఈనెల 30 వరకు హైదరాబాద్‌లో రాష్ట్రపతి శీతాకాల విడిది ఉంటుంది.
Read also: Vizag Kapunadu Public Meeting: విశాఖలో కాపునాడు బహిరంగసభ.. సర్వత్రా ఉత్కంఠ
తెలంగాణలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ నెల 26 నుంచి 30 వరకు పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ఈ మేరకు తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా బొల్లారం, సోమాజిగూడతో పాటు నగరంలోని పలు ప్రాంతాల మధ్య ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. హకీంపేట్, తిరుమలగిరి, కార్ఖానా, సికింద్రాబాద్ క్లబ్, టివోలి, ప్లాజా, బేగంపేట, రాజ్ భవన్ రోడ్, సోమాజిగూడ మధ్య సోమవారం ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు.
* శామీర్ పేట నుంచి ఓఆర్ ఆర్ మీదుగా మేడ్చల్ కు ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లాలని సూచించారు. కొంపల్లి, సుచిత్ర, బోయిన్‌పల్లి, తాడ్‌బండ్, లీ రాయల్ ప్యాలెస్ మధ్య లేదా శామీర్ పేట నుంచి కీసర, ఘట్‌కేసర్, ఉప్పల్ మీదుగా బిట్స్, హైదరాబాద్ వెళ్లాలని సూచించారు.
* కరీంనగర్ మార్గంలో వచ్చే ప్రయాణికులు జేబీఎస్-అల్వాల్ మార్గంలో వెళ్లవద్దని, ప్రత్యామ్నాయంగా ఓఆర్ఆర్-మేడ్చల్ లేదా ఘట్‌కేసర్ నుంచి కొంపల్లి, ఉప్పల్ వెళ్లాలని సూచించారు.
Read also: Russia: అణ్వాయుధాలే మమ్మల్ని కాపాడుతున్నాయి.. పశ్చిమదేశాల్ని నిలువరిస్తున్నాయి.
* మంగళవారం హకీంపేట్, సికింద్రాబాద్ క్లబ్, టివోలి, ప్లాజా, సిటిఓ, ప్యారడైజ్, రాణిగంజ్, కర్బలా, ట్యాంక్ బండ్, లిబర్టీ, హిమాయత్ నగర్ వై జంక్షన్, నారాయణగూడ క్రాస్ రోడ్డు ప్రాంతాల మధ్య ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. ఈ సమయంలో ట్యాంక్‌బండ్ సాధారణ ట్రాఫిక్‌కు మూసివేయబడుతుందని పోలీసులు తెలిపారు.
* రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా ఈ నెల 30 వరకు నగరంలోని పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. శీతాకాల విరామ సమయంలో ఐదు రోజుల పాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ద్రౌపది ముర్ము బస చేస్తారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో నగరంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 1500 మంది పోలీసులను మోహరిస్తారు.
ద్రౌపది ముర్ము తొలిసారిగా తెలంగాణకు వస్తున్నందున అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం సాయంత్రం 4.15 గంటలకు హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. మైమానిక దళం శిక్షణా కేంద్రంలో సీఎం, గవర్నర్, ఇతర ఉన్నతాధికారులతో భేటీ కానున్నారు. అనంతరం రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు. తొలిసారిగా తెలంగాణకు వస్తున్న ద్రౌపది ముర్మును ఘన స్వాగతం పలికేందుకు సీఎం కేసీఆర్, అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.