శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రి సత్యవతి రాఠోడ్ స్వాగతం పలికారు. శంషాబాద్ నుంచి రాష్ట్రపతి నేరుగా హెలికాప్టర్‌లో శ్రీశైలం బయలుదేరారు.
తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము పర్యటించనున్నారు. ఉదయం 10.40కి శంషాబాద్ ఎయిర్‌పోర్టు చేరుకోనున్నారు. శంషాబాద్‌నుంచి హెలికాప్టర్లో నేరుగా శ్రీశైలం వెళ్లనున్నారు రాష్ట్రపతి ముర్ము. ఉదయం 11.45కు సుండిపెంట హెలిప్యాడ్ చేరుకోనున్నారు. రోడ్డు మార్గం ద్వారా 12.05కు శ్రీశైలానికి చేరుకోనున్నారు రాష్ట్రపతి. మధ్యాహ్నం 2.45 నిమిల వరకు ఆలయ దర్శనం అనంతరం వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.